ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో సోమవారం ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో 7 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందని తెలిపారు. ఖర్చులు తగ్గించుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులకు లేఖ రాస్తామన్నారు. బడ్జెట్ కేటాయించిన దానికంటే రూ.10 వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టామని తెలిపారు. లెవి విధానం ఎత్తివేతతో రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందన్నారు.