'వీధి వీధిన బెల్ట్ షాపులు పెట్టిన బాబు' | Dharmana prasada rao takes on chandrababu | Sakshi
Sakshi News home page

'వీధి వీధిన బెల్ట్ షాపులు పెట్టిన బాబు'

Dec 12 2015 9:16 AM | Updated on Aug 18 2018 6:18 PM

'వీధి వీధిన బెల్ట్ షాపులు పెట్టిన బాబు' - Sakshi

'వీధి వీధిన బెల్ట్ షాపులు పెట్టిన బాబు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు 18 నెలల పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిప్పులు చెరిగారు.

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడి18 నెలల పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిప్పులు చెరిగారు. శనివారం శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ... 65 ఏళ్లుగా రైతాంగానికి వెన్నుదన్నుగా నిర్మించుకున్న ఆర్థిక వ్యవస్థ పరపతిని చంద్రబాబు తన 18 నెలల పాలనలో నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

గతంలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మహిళల పొదుపు విధానం చంద్రబాబు హయాంలో విచ్ఛిన్నం అయిందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో మహిళలు బ్యాంకుల ముందు దోషులగా నిలిచారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఈ 18 నెలల్లో వీధి వీధిన రెట్టింపు బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారని ధర్మాన మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement