శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది.
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. గురువారం తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం దుబాయ్ నుంచి విమాన ప్రయాణికులను తనిఖీ చేయగా ఓ ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.