ప్రజల దృష్టిని మళ్లించే ప్రతిభ

shekhar gupta writes on Crises - Sakshi

జాతిహితం

ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఎదురైన సంక్షోభాల జాబితాను పరిశీలిం చండి. ఎప్పుడూ ఇదే వ్యూహాన్ని అనుసరించడం కనిపిస్తుంది. యురిలో వైఫల్యాన్ని నాట కీయంగా జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌తో సర్దుకున్నారు. దీనిని ప్రశ్నిస్తే సైనిక బలగాలను శంకించినట్టవుతుంది కాబట్టి ప్రతిపక్షాలు కూడా నోరెత్తకుండా అభినందించాయి. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఇక సహించలేరన్న స్థాయికి చేరుకున్న తరువాత, దేశంలో అక్కడా ఇక్కడా పెద్ద పెద్ద నోట్ల గుట్టలు కనుగొన్నట్టు కథనాలు, ఫొటోలు దర్శనమిచ్చాయి.

వారం క్రితం అందరి దృష్టినీ బాగా ఆకర్షిస్తూ పత్రికల మొదటి పేజీలలో కనిపించిన పతాక శీర్షికలనీ, వాటి ఆధారంగా చానళ్లలో ప్రైమ్‌టైమ్‌ కార్య క్రమాలలో వినిపించిన గావుకేకలనీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి! ఇవన్నీ కూడా  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి ఆ మామాఅల్లుళ్లు నీరవ్‌ మోదీ, మేహుల్‌ చోక్సీ సొమ్ము దొంగిలించిన ఉదంతానికి సంబంధించినవే. ఆ గొడవ పేపర్లలో కనిపిస్తూ ఉండగానే వేయి కోట్ల రూపాయల పరిమితితో రోటోమ్యాక్‌ పెన్నుల సంస్థ అధిపతి విక్రమ్‌ కొఠారీ, ఇంకా ఇతరులు బ్యాంకు లకు టోపీ వేయడం గురించి కూడా వార్తలు వచ్చాయి. చూడబోతే ఇలాంటి భాగోతం ఇంకా కొనసాగేటట్టే కనపడుతోంది. 

అవినీతి మీద పోరాటం నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఈ పరిణామం అంత మంచిది కాదు. ప్రజా«ధనానికి కాపలాదారుడిని (చౌకీ దార్‌) అంటూ గతంలో మోదీ చెప్పుకోవడాన్ని గుర్తుచేస్తూ విమర్శకులూ, కాంగ్రెస్‌వారూ ప్రధానిని ఎద్దేవా చేస్తున్నారు. ఇక బీజేపీ అవినీతి వ్యతిరేక నినాదాన్ని చేజార్చుకుందనీ, మరీ ముఖ్యంగా దావోస్‌లో జరిగిన సమావే శంలో నీరవ్‌ మోదీ, ప్రధాని నరేంద్ర మోదీతో కలసి ఫొటో దిగిన నేపథ్యంతో ఇది మరింత స్పష్టమైందనీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పన్ను ఎగవేత లేదా రుణాల ఎగవేత కారణంగా విదేశాలకు ఉడాయించిన విజయ్‌ మాల్యా, లలిత్‌ మోదీ అనే ఇద్దరు లబ్ధప్రతిష్టుల పేర్లు, తాజాగా మరో రెండు పేర్లతో జతగూడాయి. కానీ బీజేపీ అధికార ప్రతినిధి మాత్రం టీవీ చానళ్లలో మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇబ్బంది పడ్డారు. యూపీఏ ప్రభుత్వ హయాం లోనే, 2011లో ఈ దొంగతనం మొదలయిందంటూ ఆ అధికార ప్రతినిధి చేసిన వాదన సీబీఐ వారి ఎఫ్‌ఐఆర్‌ దగ్గర వీగిపోయింది. అయితే ఇలాంటి పతాక శీర్షికలు రుచించలేదు. దీనితో అంతా మారిపోయింది. ఆ పతాక శీర్షిక లన్నీ కాలగర్భంలో కలసిపోయాయి. కొత్తవి అవతరించాయి.

సమయం సందర్భమే ముఖ్యం
అంటే ఇది శ్రీదేవి మరణంతో జరిగిందని మాత్రం నేను సూచించడం లేదు. ఆ నటి మరణం పూర్తిగా విషాదం, యాదృచ్ఛికం. ఆ పెద్ద మార్పు మానవ ప్రేరేపితమే. ఇంకా చెప్పాలంటే బీజేపీ తెచ్చిన మార్పే. ఈ కాలమ్‌ అచ్చుకు వెళ్లిపోతున్నది కాబట్టి, కొత్త పతాకశీర్షికల గురించి ఆలోచించాలి. ఇంద్రాణి, పీటర్‌ ముఖర్జియాల నుంచి కార్తి చిదంబరం 7,00,000 డాలర్లు తీసు కున్నారా? ఈ ఒప్పందం కుదర్చడంలో ఆయన తండ్రి తోడ్పడ్డారా? కస్టడీలో ఉన్న కార్తికి ఇంటిదగ్గర నుంచి వచ్చిన భోజనాన్ని అనుమతించలేదు. కానీ ఆయన బంగారు గొలుసు, ఇతర ఆభరణాలని మాత్రం న్యాయమూర్తి అను మతించారు. ఇలాంటివే ఇంకా శీర్షికలు. ప్రకటనలన్నీ మారిపోయాయి. నిజా నికి కార్తిని గడిచిన ఆ ఏడురోజులలో ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు. అయితే ఆయన దేశం వీడి వెళుతున్నప్పుడు అరెస్టు చేయలేదన్న విషయాన్ని మాత్రం గమనించండి! ఆయన తిరిగి స్వదేశానికి చేరుకున్నాక విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం? ప్రజలకు చేరవేయదలుచుకున్న సమాచారాన్ని క్రమబద్ధం చేయదలుచుకుంటే అందుకు సరైన సమయం ఎంచుకోవడం ప్రధానం. 

నాలుగు సంవత్సరాలు నానిన తరువాత ఇప్పుడు లోక్‌పాల్‌ నియా మకం విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. అంతా ఊహించినట్టే కాంగ్రెస్‌ నిర సన వ్యక్తం చేసింది. దీని మీద ధర్మబద్ధమైన పతాకశీర్షికలతో వార్తలు వచ్చాయి. తరువాత మరో తాజా అంశానికి సంబంధించిన శీర్షికలు వచ్చాయి. అవి పరారైన ఆర్థిక నేరగాళ్ల పని పట్టేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదిస్తూ ఈ వారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణ యానికి చెందినవి. ఈ బిల్లు ప్రకారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థల ఆదేశాలకు ఆరువారాల లోగా స్పందించని వారందరినీ పరారైన ఆర్థిక నేరగాళ్లుగానే పరి గణిస్తారు. మాల్యానీ, నగల వ్యాపారి మోదీని పరారైన ఆర్థిక నేరగాళ్లని ఇప్పుడు ప్రకటిస్తే అందులో తేడా ఏమిటో తెలియక మనం విస్తుపోవల సిందే. అంతేకాదు, ఒక ప్రశ్నను కూడా మనం సహేతుకంగా అడగవచ్చు. వారు ఇప్పటికే పరారైన నేరగాళ్లు కాదా? మరొక సందర్భంలో అయితే దీనిని నేను లాలీపాప్‌ రాజకీయమని కొట్టిపారేసేవాడిని. అంటే ఒక సమస్యని పరిష్కరించలేని స్థితిలో, ఆ సమస్యని పరిష్కరించేశామన్నట్టు ఒక చట్టాన్ని మాత్రం చేసి ఊరుకోవడమే. కానీ ఇప్పుడు ఆ మాట అనను. ఎందుకంటే ఏం కావాలని కోరుకున్నారో దానినే ఇది చక్కగా నెరవేరుస్తున్నది. 

చేతులు కాలాక...
ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి ప్రభుత్వం చేయదలుచుకున్న కొత్త చట్టాల గురించి కూడా వార్తలు బయటకొస్తున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టే ఉద్దేశంతో దేశం విడిచి వెళ్లిపోతున్న వారిని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేస్తారని, దీనికి అవసరమైన కొత్త నిబంధనలనే కేంద్రం రూపొందిస్తున్నదని వార్తలు బయటకొస్తున్నాయి. ఈ విషయాన్ని చట్టబద్ధత, ప్రాథమిక హక్కులు అనే కోణం నుంచి చూద్దాం. వ్యాపారంలో నష్టం రావడం చేత, లేదా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టే ఉద్దేశంతోనే ఒక పౌరుడు దేశాన్ని వీడి వెళుతున్నాడని ఎవరు నిర్ధారిస్తారు? ఇంకా చెప్పాలంటే, భారతదేశంలో పాత పోలీసు వ్యవస్థలో కనిపించే పద్ధతిలా ఇది కనిపిస్తుంది. దోపిడీ జరిగిపోయిన తరువాత, అది జరిగిన ఇంటి ముందు పోలీసులను నియమించేవారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇలాంటిదేనని అనిపించడం లేదా? ప్రస్తుతం ఉన్న రాజకీయ స్థితినీ, సరిగ్గా వారం క్రితం బీజేపీ చేష్టలుడిగిన క్షణాలనీ పోల్చి చూడండి. ఏ టీవీ చానల్‌లో చూసినా బీజేపీ పైచేయిగా తన దాడిని కొనసాగిస్తూ ఉంటే, కాంగ్రెస్‌ చిదంబరాలను వెనకేసుకురావడంలో మునిగి ఉంది. లోక్‌పాల్, పలాయత ఆర్థిక నేరగాళ్ల నిరోధక బిల్లు, ఇలాంటి నేరగాళ్ల కదలికల మీద ఇమ్మిగ్రేషన్‌ శాఖ ఆంక్షలు వంటి అంశాల మీద ఇతరత్రా కూడా సంపాదక వ్యాఖ్య, చర్చలు వినపడుతున్నాయి. జాతీయ బ్యాంకుల చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ పర్యవేక్షణల మీద కొత్త నిబంధనావళిని కూడా ప్రకటిం చారు. రూ. 50 కోట్ల వరకు ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేసిన వారి జాబితాలను సీబీఐకి అందించాలని కూడా ఈ బ్యాంకులను ఆదేశించినట్టు కనిపిస్తున్నది.

శీర్షికల మర్మం ఇదే!
ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. పలుకుబడి కలిగిన బడా వ్యాపా రులు రూ. 20,000 కోట్లకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన తరు వాత మాత్రమే ఈ చర్యలన్నీ ప్రారంభమైనాయి. అలా పలాయనం చిత్త గించిన వారిలో ఒకరు మోదీతో దావోస్‌లో ఫొటో దిగినవారు. మరొకరు స్వయంగా మోదీయే ‘మేహుల్‌ భాయ్‌’ అని సంభోధించినవారు. ఇదంతా అశుభ సమాచారమే. అయినా మనం మరచిపోదగినది, మరిచిపోయినదీ కూడా. కానీ ఒక్క వారంలోనే ఇలాంటి దోపిడీని అరికట్టలేని ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం మీద  ముద్ర పడింది. తన రక్షణలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను దోపిడీ చేయడానికి, దివాలా తీసే పరిస్థితులు కల్పించడానికి ఇలాంటి దొంగలకు అవకాశం ఇచ్చిందన్న అభియోగం ఎదుర్కొంది. అంతా తల్లకిందులైంది.

పతాకశీర్షికలను శాసించడంలో రాజకీయం చేసే మర్మం ఇదే. 
ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఎదురైన సంక్షోభాల జాబితాను పరిశీలించండి. ఎప్పుడూ ఇదే వ్యూహాన్ని అనుసరించడం కని పిస్తుంది. యురిలో వైఫల్యాన్ని నాటకీయంగా జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌తో సర్దు కున్నారు. అయితే దీనిని ప్రశ్నిస్తే సైనిక బలగాలను శంకించినట్టవుతుంది కాబట్టి ప్రతిపక్షాలు కూడా చాలావరకు నోరెత్తకుండా అభినందించాయి. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఇక సహించలేరన్న స్థాయికి చేరుకున్న తరువాత, దేశంలో అక్కడా ఇక్కడా పెద్ద పెద్ద నోట్ల గుట్టలు కనుగొన్నట్టు కథనాలు, ఫొటోలు దర్శనమిచ్చాయి. తరువాత ఆ నోట్ల గుట్టలు నకిలీవని కూడా తేలింది. కానీ అప్పటికి ప్రజల ఆలోచనలను అది మళ్లించగలిగింది.  రోహిత్‌ వేముల ఉదంతాన్ని తీసుకోండి. అతడి ఆత్మహత్య తరువాత జేఎన్‌యూ విద్యార్థుల మీద కేసులు నమోదు చేసి దృష్టి మళ్లించారు. కన్హయ్యకుమార్, ఉమర్‌ ఖాలిద్‌ ‘భారత్‌ను ముక్కలు చేస్తాం’ అని ఉపన్యాసాలు ఇచ్చారంటూ దేశద్రోహం కేసులు మోపారు. వాళ్ల ఉపన్యాసాల వీడియోలను చూడకుం డానే ఈ కేసులు నమోదయ్యాయి. డోక్లాం సంక్షోభాన్ని మరింత సున్నితమైన విధానంతో ఏమార్చారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆ విషయాన్ని విశేషంగా చూపించవద్దని పత్రికలను, టీవీ చానళ్లను ‘ఒప్పిం చడం’ ద్వారా ఆ పని చేశారు. కశ్మీర్‌ సరిహద్దులలో జరిగిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ గురించి సాయం వేళల్లో గొంతు చించుకునే కమాండో కమేడియన్లు డోక్లాం గురించి మాటమాత్రంగా కూడా ఏమీ చెప్పలేదు.

వార్తలన్నీ మోదీని ఆకాశానికెత్తేవే...
సాధారణంగా సందేశాలని ప్రభుత్వాలన్నీ సొంతం చేసుకుంటాయి. కానీ మోదీ, షా బీజేపీ మాత్రం దానిని ఒక లలితకళగా అభివృద్ధి చేసింది. అన్ని పతాక శీర్షికలు కూడా కచ్చితంగా మోదీ ముద్రకు చెందిన మూడు కోణాలను ప్రతిబింబిస్తాయి: ఆయన మచ్చలేని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు. హిందూత్వ ఛాయతో ఉన్న జాతీయవాదాన్ని ఎలాంటి శషభిషలు లేకుండా రక్షించేవాడు. విస్తారమైన భుజాలు, విశాలమైన ఛాతి కలిగిన ఆయన ముఖంలో ఎలాంటి సంక్షోభమైనా సరే, చిన్న మార్పును కూడా తేలేదు. ఆయన చేసేదేదీ తప్పు కాదని ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ఆయన అజేయుడు. ఆ కారణంగానే ఆయన ఏ వైఫల్యం గురించి స్పందించ రాదని గట్టిగా నిశ్చయించుకున్నారు. మన్మోహన్‌ సింగ్‌తోను, ఆయన ప్రభుత్వం తోను బేరీజు వేసి చూడండి. తమ సంరక్షణలో ఒక కూరల బండి నుంచి ఎవరో కొన్ని టొమేటోలు దొంగిలించారని తెలిసినా వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. అందుకే సంక్షోభాల వేళ మోదీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో వారు భయ విహ్వలురై చూడాలి. అలాగే వారి ప్రభుత్వం ప్రదర్శించే రాజ కీయ తెలివిడిని శ్లాఘించాలి.

వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
శేఖర్‌ గుప్తా
twitter@shekargupta

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top