మహమ్మారి కరోనా.. ప్రపంచానికే పెనుసవాల్‌

Sailaja And Venugopal Writes Special Story On Coronavirus - Sakshi

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక ఉపద్రవం ముంచుకొచ్చింది. ఇది తీవ్రవాదం కాదు. అలా అని ప్రకృతి వైపరీత్యం కాదు. అదే  కరోనా వైరస్‌  వ్యాధి.  ఒకేసారి 1,45,341 మంది  ఈ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఈ సంఖ్య పెరుగుతోంది. 138 దేశాలకు కరోనా వైరస్‌ వ్యాపించింది. ఇప్ప టికి 5,670 మందికి పైగా మరణించారు. మహా కార్చిచ్చులా వ్యాధి, దానితోపాటు సంచ లనం వ్యాపించింది. ఎక్కడ చూసినా, ఆంక్షలు, నిషే ధాలు. ప్రయాణాలు  స్తంభించిపోయాయి.

వీసాలు రద్దు చేశారు. ప్రయాణికులను వైరస్‌ నివారణ కోసం క్వారంటైన్‌ చేయడం మొదలుపెట్టారు. హాస్పిటల్స్‌  అన్నీ వైరస్‌ కోసం ప్రత్యేక వార్డులతో సిద్ధమవుతున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ కుదేలైంది. ఉద్యోగులంతా ఇంటినుంచి పని చేయమని సూచ నలు. సభలు, సమావేశాలు, ఆటలు చివరికి పెళ్లిళ్లు కూడా వాయిదా వేయవలసిన పరిస్థితులు. గ్లోబల్‌ విలేజ్‌లో కరోనా, గుసగుసల సంభాషణగా మొదలై, ఇప్పుడు ప్రధానాంశమైంది. 

యుద్ధకాలంలోలాగా ఏ మూల నుంచి ఏ వార్త విన్నా మరోచోట మనిషి స్పందిస్తున్నాడు. ‘విశ్వ వ్యాప్త వల’ ప్రభావం. మనందరం దానికి చిక్కిన చేపలమే! అది వార్తో, పుకారో! ఏదైనా కానీ, ముందు భయం. తరువాత, ఆ భయాన్ని ఎదు ర్కొనే మార్గాలు వెతుకుతున్నాం. ఈ నేపథ్యంలో, ప్రజలు, ప్రభుత్వాల వైఖరి  జీవితం కన్నా పెద్దది (లార్జర్‌ దెన్‌ లైఫ్‌) అయ్యింది.

ప్రపంచ ఆరోగ్యసంస్థ ‘మెడికల్‌ ఎమర్జెన్సీ’గా  కరోనాను ప్రకటించిన తరువాత చాలా ప్రభు త్వాలు అప్రమత్తమైపోయాయి. ప్రస్తుతం మారు మూల ప్రాంతంలో సహితం కరోనా వైరస్‌ హెల్ప్‌ సెంటర్స్, వైరస్‌ కనుగొనే పరిశోధనాశాలలు మొద లుపెట్టారు. అనుమానాస్పద రోగినుంచి తీసుకున్న నమూనాలను సేకరించడంలో పారామెడికల్‌ సిబ్బంది మునిగిపోయారు. 2.9% మాత్రమే మర ణం సంభవిస్తున్న ఈ వైరస్‌పట్ల ఇంత ప్రచారం ఎందుకు జరుగుతోంది? అన్న భయాందోళనలు చదువుకున్న వారిని కూడా చుట్టుముట్టాయి.

చికిత్స కన్న నివారణ మేలు అన్నది అతి ముఖ్యమైన వైద్య ఆరోగ్య సూత్రం. ఈ  నేపథ్యంలో ప్రభుత్వాలు మాస్‌ మీడియాను ఉపయోగించడం మొదలుపెట్టాయి. ముందెన్నడూ తెలియని విధంగా ఇప్పుడు ఫోన్‌ చేస్తే చాలు, కాలర్‌ ట్యూన్‌ లోని పలు ప్రాంతీయ భాషలలో సైతం వ్యాధిని నియంత్రించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను 30 నుంచి 60 సెకన్ల వరకు ప్రసారం చేస్తున్నారు. ఇక వార్తాపత్రికలు, టీవీ చానల్స్‌ శక్తికొలదీ వార్తలను,  సంచలనాలను కూడా చేరవేస్తూ ఉన్నాయి. జెన్‌ గ్రీన్‌బర్గ్, షెల్డన్‌ సోలమన్‌ తదితరులు చెప్పిన ‘టెర్రర్‌ మేనేజ్‌మెంట్‌’ అనే సిద్ధాంతం ప్రకారం ఊహకు అందనంత పెద్దపెద్ద ప్రమాదాలు వచ్చి నప్పుడు ‘మానవజాతి మానసికస్థితి’ సామూహి కంగా మూడు రకాలుగా ఉంటుంది.

1. భయాందోళన: భయంతో విలవిలలాడటం. 2. నిర్లక్ష్యం: చావు ఎలాగూ తప్పదులే అన్న ఒక నిస్తేజం. 3. ప్రాంతీయ, దేశ, సంఘ, సంస్కృ తులతో తరాల కొద్దీ చేసే కొన్ని ప్రక్రియలు పూజలు, చిహ్నాలు ఏర్పాటు చేయడం, సామూహిక ప్రదర్శనలు.. ఇలాంటివి. అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం కాలంలో 30 దేశాల సైనికులు పోరాడగా, ఎక్కడ ఏ మరణం సంభవించినా  తమ కుటుంబం లోని ఒక వ్యక్తి అకారణంగా చనిపోయేడు అనే విషాదంతో మునిగిపోయేవారు.

మరి ఇప్పుడో? సమాజంలో సహానుభూతి కన్నా, హాస్యం, హేళన పాలు మటుకు పెరిగాయి అనిపిస్తుంది.  హాస్యనటుల బొమ్మలతో... పాపం వారు వ్యక్తిగ తంగా ఎంత బాధ పడుతున్నారో ! తెలియదుగానీ ‘వాడు దగ్గుతున్నాడు ఎక్కడ దాచావు?’ అని, వీడి యోలు, సందేశాలు వచ్చేశాయి. పెద్దలు, వైద్యులు అంతా వాటిని చూసి నిర్ఘాంతపోయారు. అలా, తలాతోకా లేనట్టు కరోనా గురించిన పేరడీల పద్యాలు, పాటలు కూడా కట్టారు. 

కొందరు కరోనా మంచికే వచ్చింది... అందరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్నారు అన్నారు. మరికొందరు ఆయా దేశాల ఆహార అలవాట్లను, పరిస్థితులను నిందిస్తున్నారు. అయితే మరో అడుగు ముందుకేసి ఇదంతా ఒక తీవ్రవాదం లేక ఇరుదేశాల మధ్య గల అంతర్గత వైషమ్యాలకు జీవు లను వాడుకోవడం అంటే బయో వార్‌ఫేర్‌ అని తేల్చేశారు.

ప్రభుత్వ సంయమనం.. వ్యక్తిగత నియంత్రణ
ఇంతకూ మనం ఎలా మారుతున్నాం? నియంత్రణ ఎంతవరకు ఉంది? సంయమనం ఎంతవరకు ఉంది? ప్రభుత్వాలు సమయం ప్రకారం బులెటిన్‌ విడుదల చేయాలి. సమూహాలను గురించి ఆంక్షలు పెట్టవచ్చు. సంచలనాలను అదుపు చేసి, అవగా హన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సినిమా హాళ్ళు, షాపింగ్‌ మాల్స్, విద్యాసంస్థలు మూసే యడం సంచలనాగ్నికి ఆజ్యం పోయడంగా పరిణ మించవచ్చు. విధాన నిర్ణయాలు ఇంకొంచెం సంయమనంతో జరగాలి. 

ఇక వ్యక్తిగత ప్రవర్తన గురించి చెప్పాల్సి వస్తే.. కింద పడకుండా ఒక ఆహార పదార్థాన్ని తినలేని సమాజం ఇప్పుడు శానిటైజర్ల  కోసం పరిగెత్తడం విచిత్రంగా ఉంది. బహిరంగ ప్రదేశాలలో ఉమ్మడం ఆపుకోలేని  మనుషులు ఖరీదైన మాస్కులు ధరిం చటం గురించి చర్చిస్తున్నారు. గొప్ప వైచిత్రి! వైవి ధ్యభరిత సామూహిక మానసిక స్థితిని చూస్తున్నాం. ఇది సమంజసమేనా?

ఒక సర్వే ప్రకారం గంటలో మనం 23 సార్లు ముఖాన్ని తడుముకోకుండా ఉండలేమట! అందు లోనూ 44% నోరు, ముక్కు, కళ్ళు  ఏదో విధంగా చేత్తో ముట్టుకుంటాము. అంతెందుకు? మన ఫోన్‌ మనం తాకకుండా ఎంతసేపు ఉండగలం? అన్నది పెద్ద సమస్యే. ఈ ఒక్క నిజం గమనిస్తే తీసు కోవా ల్సిన జాగ్రత్తలు, అలవరుచుకోవలసిన  ఆరోగ్యకర మైన అలవాట్లు ఎన్ని ఉన్నాయి? 

బహిరంగ మల, మూత్రవిసర్జననే మానలేక పోతున్నాం. వ్యర్థాలను సవ్యంగా డస్ట్‌ బిన్‌లో  వేయలేకపోతున్నాం. కనీసం ఉతికిన బట్టలు వేసు కోవడానికి కూడా ఏదో అడ్డువస్తోంది! దాన్ని ‘జీన్స్‌ ఫ్యాషన్‌’ అని పేరు కూడా పెట్టుకున్నాము. ఒక మంచి అలవాటు ఇవ్వడానికి మనిషికి కనీసంగా 66 రోజులు పడుతుందట. ఇప్పటికైనా మనిషి మేలుకొని, పూర్తి అవగా హనతో సోషల్‌ మీడియా హల్‌చల్‌ మానేసి నియం త్రణవైపు, బాధ్యతతో అడుగులు వేయాలని, వేస్తా డని ఆశిద్దాం.

వ్యాసకర్తలు:
నాగసూరి వేణుగోపాల్‌ ‘ 94407 34392
కాళ్ళకూరి శైలజ ‘ 98854 01882

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top