వైస్రాయ్‌ టు పార్క్‌ హయత్‌

Guest Column By Vardelli Murali On Politicians Corruption - Sakshi

ఇదో పెద్ద కుట్ర కథ. నిడివి ఇప్పటికి పాతికేళ్లు. ఇప్పుడే కథ క్లైమాక్స్‌కు చేరుకుంటున్న సంకేతాలు కనబడుతున్నాయి. మరో రెండు మూడేళ్లలో ముగింపు కార్డు పడొచ్చు. కుట్రలో పుట్టి, కుట్రలో పెరిగి, కుట్రలో పయనించి, తన కుట్రకు తానే బలి కాబోతున్న ఒక ఆసక్తికరమైన రాజకీయ ఇతివృత్తమిది. అంతకు ముందటి రాజకీయ వ్యవస్థ ఊహించి కూడా ఎరుగనంత విశృం ఖల స్థాయి అవినీతి ఈ పాతికేళ్లను సూత్రధారిలా నడిపించింది. వంచన, దగా, వెన్నుపోటు, నమ్మక ద్రోహం, ఆశ్రిత పక్షపాతం, గోబెల్స్‌ ప్రచారం ఈ కథలోని ఒక్కో అధ్యాయాన్ని నడిపిం చాయి. ఓట్లు కొనుగోలు చేయడం, ప్రజా ప్రతినిధులకు వెల కట్టడం వంటి రాజకీయ గారడీ విద్యలను ఈకాలంలోనే కని పెట్టారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను కూడా తన అవసరా లకు అనుగుణంగా ఏమార్చుకోగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ రాజకీయ వ్యవస్థ సమకూర్చుకోగలిగింది. ఇటువంటి గంభీర సన్నివేశాల్లో కథను అనూహ్య మలుపులు తిప్పే కొన్ని ఐటమ్‌ సాంగ్స్‌ కూడా ఉంటాయి. ఉమ్మడి స్వార్థ ప్రయోజనాలకోసం మీడియా–రాజకీయం ఏకమై ప్రజల కళ్లకు గంతలు కట్టి, ఊరే గడం ఈ కథలోని ప్రత్యేక లక్షణం.

ఆనాటి తెలుగు ప్రజల అభిమాన సినీనటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమునిగా ప్రశంసలందుకున్న ఎన్టీ రామా రావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు వారి అభిమాన ‘ధనాన్ని’ రెండు చేతులా ఆర్జించిన తాను, వారి రుణం తీర్చుకోవడానికే పార్టీ పెడుతున్నట్టు ఆయన ప్రకటిం చారు. తొమ్మిది మాసాల్లోనే వచ్చిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయాన్ని సాధించింది. ముక్కుసూటి మనిషి కావడం వలన తాను ముందుగా ప్రకటించినట్టుగానే తన పరిపాలనలో ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేశారు. అడపాదడపా కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చినా తన పార్టీ మౌలిక లక్ష్యాల నుంచి మాత్రం పక్కకు జరగలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భా వానికీ, విజయానికి దోహదం చేసిన వారిలో కొన్ని స్వార్థపర శక్తులు కూడా ఉన్నాయి. రాజకీయ అనుభవరాహిత్యం కార ణంగా ఎన్టీ రామారావు తమ చెప్పుచేతల్లో ఉంటారని ఈ శక్తులు భావించాయి. కానీ, రామారావు వీరికి లొంగలేదు. దాదాపు ఒక పుష్కరకాలం పాటు ఆయన తన పంథాలోనే కొనసాగారు. ఎన్టీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శక్తులు తమ కుట్రను అమలుచేశాయి.

అధికార లాలసుడైన చంద్ర బాబు కథానాయకుడుగా ఈ కుట్ర కథను రచించాయి. ట్యాంక్‌ బండ్‌ తూములను ఆక్రమించి కట్టిన వైస్రాయ్‌ హోటల్‌ కథ క్లైమాక్స్‌ ఘట్టానికి 1995 ఆగస్టు చివరి రోజులలో వేదికగా నిలిచింది. అంతకు ఏడాది ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నిక లప్పుడే భవిష్యత్‌లో చంద్రబాబుకు మద్దతుగా నిలబడేవిధంగా కొందరు అభ్యర్థుల ఎంపిక, వారికి ఆర్థిక సహాయం కూడా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. 95 మే, జూన్‌ల నుంచి కుట్ర అమలు కార్యక్రమం ప్రారంభమైంది. గోబెల్స్‌ ప్రచారాన్ని హిట్లర్‌ను మించి వాడుకున్న అరుదైన ఉదాహ రణగా వైస్రాయ్‌ ఎపిసోడ్‌ గుర్తుండిపోయింది. మొదట చంద్ర బాబుకు నమ్మకస్తులైన ఓ పదిమంది ఎమ్మెల్యేలను హోటల్‌లో ప్రవేశపెట్టారు. తరువాత కొందరు మీడియా ప్రతినిధులు మిగి లిన ఎమ్మెల్యేలందరికీ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. తెలు గుదేశం పార్టీని ‘ఒక దుష్టశక్తి’ నుంచి రక్షించడానికి ఎమ్మెల్యే లంతా వైస్రాయ్‌లో సమావేశమవుతున్నారు. మీరు రాకపోతే నష్టపోతారని ఆ ఎమ్మెల్యేలను బెదరగొట్టారు. మొబైల్‌ ఫోన్లు లేని రోజులు. క్రాస్‌ చెక్‌ చేసుకునే అవకాశాలు తక్కువ. ఆదు ర్దాతో కొందరు, ఏం జరుగుతుందో తెలుసుకుందామనే కుతూ హలంతో మరికొందరు ఎమ్మెల్యేలు వైస్రాయ్‌ హోటల్‌కు చేరుకున్నారు.

వచ్చినవాళ్లందరినీ హోటల్‌లోనే బంధించారు. ఆ రకంగా ఒక పాతిక ముప్పయ్‌ మంది ఎమ్మెల్యేలు వైస్రాయ్‌ హోటల్‌లో పోగయ్యారు. కానీ, మరుసటిరోజు పత్రికల్లో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా వందమందికి పైగా ఎమ్మెల్యేలు వైస్రాయ్‌లో క్యాంపు వేశారని బ్యానర్‌ వార్తలు వచ్చాయి. దాంతో మరికొన్ని గోడమీది పిల్లులు క్యాంపులో దూకేశాయి. వ్యవస్థలనూ ప్రభావితం చేసే ప్రక్రియ కూడా అప్పటినుంచే ప్రారంభమైంది. వైస్రాయ్‌లో ఉన్న తన ఎమ్మెల్యేలను కలవ డానికి ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చిన ఎన్టీఆర్‌ను పోలీసులు అనుమతించలేదు. రోడ్డుపైనే చైతన్యరథాన్ని నిలుపుకుని హోటల్‌ లోపల ఉన్న ఎమ్మెల్యేలకు వినిపించేలా మైక్‌ తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టారు. వెంటనే అక్కడ సిద్ధంగా ఉంచిన కిరాయి మూకలు ఎన్టీఆర్‌ వాహనంపైకి చెప్పులు విసరడం ప్రారంభించాయి. వాళ్లను వదిలేసి ఎన్టీఆర్‌ వాహనాన్ని పోలీ సులు వెనక్కి మళ్లించారు. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులందరినీ మభ్యపెట్టి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికవుతారు. బలపరీక్ష రోజు ఎన్టీఆర్‌కు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వ కుండా అవమానించి సభ నుంచి పంపిస్తారు. కలత చెందిన ఎన్టీఆర్‌ తనపై వెన్నుపోటు కుట్రకు కారకులైన చంద్రబాబు పైన, ఒక పత్రికాధిపతిపైనా తీవ్ర విమర్శలు చేస్తారు. చంద్ర బాబును ఔరంగజేబుతో ఆయన పోల్చారు.

ఔరంగజేబు కూడా అధికారంలోకి రావడానికి తండ్రి షాజహాన్‌కు వ్యతిరేకంగా కుట్రచేసి సోదరులైన దారాషికో, మురాద్, షాషుజాలతో వేరు వేరుగా మంత్రాంగం చేస్తాడు. విడివిడిగానే ముగ్గురినీ అంత మొందించి తండ్రిని చెరసాలలో వేసి సింహాసనాన్ని అధిష్టి స్తాడు. సోదరి జహనారాపై కూడా హత్యాప్రయత్నం జరుగు తుంది. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా జరిగిన వెన్నుపోటు కుట్రలో కూడా ఎన్టీఆర్‌ మిగిలిన సంతానాన్ని మభ్యపెట్టి భాగస్వాము లను చేశారు. వారికి భవిష్యత్తులో పట్టబోయే దుర్గతిని ఎన్టీఆర్‌ ముందుగానే ఊహించి చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చారు.  తనకు జరిగిన అవమానానికి తీవ్రమైన వ్యథకు లోనై మరో నాలుగు నెలల్లోనే ఆయన కన్ను మూశారు. ఈ కుట్ర ప్రారంభమై ఈ సంవత్సరానికి సరిగ్గా పాతికేళ్లు నిండింది. వెన్ను పోటు దినంగా ప్రకటించడానికి ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన ఆగస్టు 27ను తీసుకోవాలా? ఆయనను తొలగించి చంద్ర బాబును టీడీఎల్‌పీ నేతగా ప్రకటించిన ఆగస్టు 24ని తీసు కోవాలా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సెప్టెంబర్‌ 1వ తేదీని తీసుకోవాలా అనే విషయాన్ని చరిత్ర కారులు నిర్ణయించాలి. హిరోషిమా పట్టణంపై అమెరికా వాళ్లు ఆటంబాంబును వేసిన ఆగస్టు 6తో సమానమైన దుర్దినం ఈ వెన్నుపోటు దినం. పాతికేళ్ల నుంచీ ఆంధ్రదేశంపై దీని ప్రభావం కనిపిస్తూనే ఉంది.

ఈనెల పదమూడో తారీఖునాడు హోటల్‌ పార్క్‌ హయత్‌లో జరిగిన ఒక ‘రాజకీయ భేటీ’కి సంబంధించిన వీడియోలు వారం రోజుల తర్వాత బయటపడ్డాయి. మరో రాజకీయ కుట్రకు సంబంధించిన ‘టిప్‌ ఆఫ్‌ ఐస్‌బర్గ్‌’గా ఈ వీడియో దృశ్యాలను రాజకీయ పరిశీలకులు పరిగణిస్తున్నారు. ఈ తాజా కుట్రకు కారణం ఏమై ఉంటుంది? వెన్నుపోటు ఘట్టం నాటినుంచి నేటిదాకా చంద్రబాబు నేతృత్వంలో తెలుగు దేశం ప్రయాణం వివరాలు అర్థమైన వారికి తాజా కుట్రకు కార ణాలు కూడా అర్థమవుతాయి. కొంతమంది స్వార్థ ప్రయోజ నాల కోసమే ఎన్టీఆర్‌ను అనైతికంగా తొలగించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్‌ పదవీచ్యుతితోనే ఆ పార్టీ మౌలిక లక్ష్యం అటకెక్కింది. అనైతిక లక్ష్యంకోసం, అనైతిక పద్ధతిలో ఏర్పడిన రాజకీయ వ్యవస్థ పయనం కూడా అనైతిక దారుల్లోనే సాగుతుంది. తెలుగుదేశం పార్టీ ఈ పాతికేళ్ల ప్రస్థానం అలాగే సాగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి తొమ్మిదేళ్ల సీజన్‌ ఒక జనజీవన విధ్వంస కాలం. వ్యవసాయ క్షేత్రాలు మరుభూములుగా మారిన దురదృష్టకర రోజులు. చేతివృత్తులు శిథిలమై ప్రజలు బతుకుదెరువు బాట పట్టగా మొండి గోడలతో పల్లెలు మిగిలిపోయిన విషాద అధ్యాయం అది. నాటి దుస్థితికి ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన ‘పల్లే కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల’ అనే పాట అద్దం పట్టింది. రాజకీయాల్లో ఓటుకు నోటు రాజ్య మేలింది. డబ్బున్నవాడే పోటీదారుడు కాగలిగాడు. రాజకీయాల నుంచి సంఘసేవకులు నిష్క్రమించారు. అయినా, అవకాశవాద ఎత్తులు పొత్తులతో చంద్రబాబు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండగలిగారు.  

అందులో నాలుగేళ్లు ఎన్టీఆర్‌ నుంచి తస్కరించి నవి. ఐదేళ్లు వాజ్‌పేయి భిక్ష. మరో ఐదేళ్లు నరేంద్ర మోదీ సంపా దనలో లభించిన వాటా. వరసగా ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి చంద్రబాబు నాయకత్వం వహించారు. రెండుసార్లు బీజేపీ ప్రభంజనంలో గట్టెక్కారు. మూడుసార్లు ఓటమి పాల య్యారు. అందులో రెండుసార్లు పొత్తులున్నప్పటికీ ఓడిపోగా మొన్నటిసారి పరోక్ష పొత్తులతో పోటీచేస్తే కనీవినీ ఎరుగని స్థాయిలో శృంగభంగం జరిగింది.రాష్ట్ర విభజన తర్వాత అదృష్టవశాత్తు చివరిసారి అధికారం దక్కినా, చంద్రబాబు ప్రభుత్వం తన సహజ విధానాల ఫలి తంగా ప్రజలను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమైంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అవినీతి విలయ తాండవం చేసింది. దేవుని భూములనూ వదలలేదు. ఇసుకను కూడా పంచదారలా చప్పరించారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు. దళితులు, మహిళలపై దాడులు యథేచ్ఛగా సాగాయి. ఫలితంగా ఎన్నికల్లో దారుణమైన ఓట మిని మూటకట్టుకోవలసి వచ్చింది. ఎన్నికల ఫలితాల కంటే తదనంతర పరిణామాలు తెలుగుదేశం పార్టీని భయకంపితం చేస్తున్నాయి. అవినీతిపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నది. కొత్త ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన పాలనా సంస్కరణలు, పూరిస్తున్న సంక్షేమ విప్లవ శంఖారావం ఫలితంగా తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలిపోతున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తున్నది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 125 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిలు గత ఏడాది కాలంగా జనంలోకి రానేలేదు.

మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలకు తోడు మరో 30 నియోజకవర్గాల్లోనే అడపాదడపా పార్టీ సందడి కనిపిస్తున్నది. మరో ఆందోళనకరమైన పరిణామం నలభయ్యేళ్లు నిండకముందే పార్టీలో వృద్ధాప్య ఛాయలు కనబడుతున్నాయి. ప్రస్తుతం నలభయ్యేళ్ల లోపు వయసులో ఉండి, కుటుంబ రాజకీయ వారసత్వం లేకుండా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ తెచ్చుకునే అవకాశం ఉన్నవారు కేవలం పదినుంచి పదిహేను మంది మాత్రమే. వారిలో అత్యధికులు రిజర్వుడు నియోజకవర్గాలకు చెందినవారు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే. కనీసం మండల స్థాయిలో కూడా స్వతంత్రంగా వ్యవహరించగల యువ నాయ కులు తెలుగుదేశం పార్టీలో (కుటుంబ వారసత్వం లేని) కాగడా వేసుకుని గాలించినా పట్టుమని పదిమంది కనిపించడం లేదు. పార్టీ అధినేత తన రాజకీయ వారసునికి పార్టీ కీలక పదవి, మంత్రి పదవి అప్పగించి నెంబర్‌ టూగా ప్రమోట్‌ చేసినా కూడా ఐదేళ్ల కాలంలో క్షేత్రస్థాయి యువ నాయకత్వం నామమాత్రంగా కూడా తయారు కాకపోవడం విషాదకర పరిణామం. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో యువనేత పార్టీ సభ్యత్వ పోటీలు నిర్వహించడం, కడుపుబ్బ నవ్వించే కొన్ని కామెడీ సన్నివేశాలను జొప్పించడం మినహా తటస్థ యువతను ఏమాత్రం ఆకర్షించలేక పోయారు.

ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో నాలుగేళ్లకు జరిగే ఎన్నికల్లో గెలవడం మాట అటుంచి గట్టిగా పోరాడే శక్తి కూడా అనుమానమే. అధికారానికి శాశ్వతంగా దూర మయ్యే పక్షంలో రాజధాని భూముల్లో ప్రపంచపు అతిపెద్ద ‘ట్రెజర్‌ హంట్‌’పై తాము పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు కావల్సిందేనా అన్న ఆలోచన తెలుగుదేశం కులీన వర్గాన్ని కుంగ దీస్తున్నది. అందుకే, ఒక ద్విముఖ వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ అమలుచేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఒకటి: మొదటినుంచీ తాము అనుసరిస్తున్న గోబెల్స్‌ దుష్ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడం. రెండు: రహస్యంగా ఏదో ఒక ప్రభుత్వ వ్యతిరేక కుట్రను ప్లాన్‌ చేయడం. బహిరంగ, రహస్య వ్యూహాలైన ఈ రెంటికీ ఈవారం సాక్ష్యాలు దొరికాయి. అక్రమ నిర్మాణంగా నిర్ధారణ అయిన కట్టడాన్ని కూల్చివేస్తే, తెలుగుదేశం నాయకులు దానికి సంతాప సభ నిర్వహించి ప్రసంగించడం గోబెల్స్‌ వ్యూహానికి పరాకాష్ట అయితే, పార్క్‌ హయత్‌ హోటల్‌లో పార్టీ కనుసన్నల్లో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని చెప్పు కుంటున్న వ్యక్తి ఇద్దరు బీజేపీ నేతలుగా చెప్పుకుంటున్న వ్యక్తులు సమావేశమవ్వడం రహస్య ప్రణాళికకు సాక్ష్యం.

వ్యాసకర్త: వర్ధెల్లి మురళి, ఈ మెయిల్‌: muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top