వారఫలాలు (జూలై 5 నుంచి జూలై 11 వరకు)

Weekly Horoscope From July 5th To July 11th - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
మిత్రులు అన్ని విధాలా సహకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. శత్రువులు సైతం అనుకూలురుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనసౌఖ్యం. పనులు చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారులకు విస్తరణయత్నాలలో విజయం. ఆశించిన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహి ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థికంగా బలపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులు మీకు చేదోడుగా నిలుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. నిరుద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గవచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. సోదరులతో కలహాలు. నీలం, నలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. 

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కుటుంబసమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. మీ ఆశయాలు నెరవేరేందుకు మిత్రులు సహకరిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఎంతటి వారినైనా నేర్పుగా ఆకట్టుకుంటారు. కుటుంబంలో క్లుప్తంగా శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో  ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొత్త విధులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ఈతిబాధలు తొలగుతాయి. కొత్త సంస్థలపై దృష్టి సారిస్తారు. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ఎంతటి వారినైనా మీదారికి తెచ్చుకుంటారు. ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. బంధువుల నుంచి ఒత్తిడులు  తొలగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. కోర్టు వ్యవహారాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు సమయానుసారం పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో  మార్పులు అనివార్యం కావచ్చు. కళారంగం వారికి కొద్దిపాటి అవకాశాలు రావచ్చు.  వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. అనుకోని ప్రయాణాలు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
చేపట్టిన పనులు కొంత ఆలస్యమైనా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు  సానుకూలమవుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం రాగలదు. సోదరులు, మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో  ముందడుగు వేస్తారు, ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.  పారిశ్రామిక, కళారంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. వారం చివరిలో సోదరులతోఅకారణంగా వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒత్తిడులు పెరుగుతాయి. ఎరుపు, బంగారు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. శుభకార్యాలపై పెద్దలతో చర్చలు జరుపుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలలో కొంత పురోగతి ఉంటుంది. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో స్థాయి పెరిగే సూచనలు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో మిత్రులతో  విభేదాలు. ధన వ్యయం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ఆత్మీయులు, బంధువులతో తగాదాలు పరిష్కారం. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. సోదరులు, సోదరీలతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు కాస్త నిరాశ తప్పకపోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. శుభకార్యాల నిర్వహణ వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు పోటీదారులతో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఎదురైనా సర్దుబాటు కాగలవు. మీ అంచనాలు ఫలించే సమయం. చేపట్టిన పనులు సమయానికి సాఫీగా సాగుతాయి. అందరిలోనూ తగిన గుర్తింపు పొందుతారు. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులనుæ కలుసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు తగినంతగా పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొన్ని పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం చివరిలో ధనవ్యయం. బం«ధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంగారు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి మాటసహాయం అందుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులæయత్నాలు సఫలం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. భూసంబంధిత వివాదాల నుంచి గట్టెక్కుతారు.  ఊహించని ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. కళారంగం వారికి ఒడిదుడుకులు తొలగుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. సోదరులతో మాటపట్టింపులు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. రుణదాతలు ఒత్తిడులు తగ్గిస్తారు. చేపట్టిన పనులు  అనుకున్న విధంగా పూర్తి కాగలవు. బంధువుల ద్వారా ముఖ్య సమాచారం రాగలదు. ప్రముఖులు పరిచయమై మాటసహాయం అందిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనసౌఖ్యం. ముఖ్య విషయాలలో చర్చలు సఫలమవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో  బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి గతం కంటే కాస్త మెరుగైన పరిస్థితి ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. నలుపు, ఆకుపచ్చ రంగులు.  తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి  సహాయం అందుకుంటారు. ఆస్తి వివాదాల  పరిష్కారంలో మీ   చొరవను కుటుంబసభ్యులు ప్రశంసిస్తారు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఆలోచనలు కొంతవరకు కలిసివస్తాయి. ముఖ్యమైన పనులలో  పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఇంటి నిర్మాణాలు తిరిగి ప్రారంభిస్తారు. వ్యాపారులకు క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగవర్గాలకు అనుకూల మార్పులు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరాజరాజేశ్వరి స్తోత్రాలు పఠించండి. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top