వారఫలాలు (26 జనవరి నుంచి 01 ఫిబ్రవరి వరకు) | Weekly Horoscope From 26th February To February 1st In Funday | Sakshi
Sakshi News home page

వారఫలాలు (26 జనవరి నుంచి 01 ఫిబ్రవరి వరకు)

Jan 26 2020 8:02 AM | Updated on Jan 26 2020 8:04 AM

Weekly Horoscope From 26th February To February 1st In Funday - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. మీ అంచనాలు, ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు ఆశించినంతగా పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది, విదేశీ పర్యటనలు.  వారం మ«ధ్యలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
శ్రమ ఫలించే సమయం. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసి ఒడ్డునపడతారు. యుక్తితో కొన్ని వివాదాలు పరిష్కారించుకుంటారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వాహన, గృహయోగాలు కలిగే సూచనలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాలు అందుకుంటారు.  ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. పసుపు, నీలం రంగులు.  తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థికంగా మరింత  ప్రగతి కనిపిస్తుంది. రుణఒత్తిడులు తొలగుతాయి. పనులు అనుకున్న విధంగా  సకాలంలో పూర్తి కాగలవు. ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.  భూ, గృహయోగాలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి బయటపడతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబసమస్యలు. అనారోగ్యం. తెలుపు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన పనులు  చకచకా పూర్తి కాగలవు. కొత్త వ్యక్తుల పరిచయం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి ప్రశంసలు పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత  లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు సంతోషం కలిగిస్తాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పసుపు, ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య

హృదయం పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
వ్యవహారాలలో విజయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు, కొత్త అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభాలదిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు.  కళారంగం వారికి ప్రోత్సాహకరమైన సమయం. వారం  చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి  చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని విజయాలు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు అనుకోని  విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. పసుపు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల కొనుగోలు యత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు.విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.  ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం.  ఎరుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ఎట్టకేలకు శ్రమ ఫలిస్తుంది.  బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి.  ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకోని  మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా వేస్తారు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వివాహాది వేడుకలలో పాల్గొంటారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ధవవ్యయం. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ మనస్సులోని భావాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. తీర్థయాత్రలు. నేరేడు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పొందుతారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement