పసందైన రుచుల సమాహారం

Variety Snacks On Funday - Sakshi

స్నాక్‌ సెంటర్‌

కీరదోస పకోడా
కావలసినవి: కీరదోస – 1 (గుండ్రంగా కట్‌ చేసుకోవాలి), శనగపిండి – 4 లేదా 5 టేబుల్‌ స్పూన్లు, కారం – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, నీళ్లు – అర కప్పు, బేకింగ్‌ సోడా – చిటికెడు, మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో శనగపిండి, కారం, జీలకర్ర పొడి, బేకింగ్‌ సోడా, మసాలా, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు గుండ్రంగా కట్‌ చేసుకున్న ఒక్కో కీరదోస ముక్కను శనగపిండి మిశ్రమంలో కలిపి.. నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.

పనీర్‌ బ్రెడ్‌ బాల్స్‌
కావలసినవి:  బ్రెడ్‌ పౌడర్‌ – ఒకటిన్నర కప్పులు, పనీర్‌ ముద్ద – 1 కప్పు (పనీర్‌ని ముందు మెత్తగా ఉడికించుకోవాలి), మైదా పిండి – 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర గుజ్జు – 1 టేబుల్‌ స్పూన్‌, పాలు – ముప్పావు కప్పు పైనే.., జీడిపప్పు గుజ్జు – 3 టేబుల్‌ స్పూన్లు, అల్లం పేస్ట్‌ – 1 టీ స్పూన్, మిరియాల పొడి – కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్‌ – 2 టీ స్పూన్లు, కారం – పావు టీ స్పూన్, ధనియాల పొడి – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో బ్రెడ్‌ పౌడర్, పనీర్, మైదా పిండి, కొత్తిమీర గుజ్జు, జీడిపప్పు గుజ్జు, అల్లం పేస్ట్, మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి, కారం, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కొద్ది కొద్దిగా పాలు కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్‌ చేసుకుని నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి.

రైస్‌బాల్స్‌ విత్‌ కోకోనట్‌ మిల్క్‌
కావలసినవి:
బియ్యప్పిండి – 1 కప్పు+3 టీ స్పూన్లు, చిలగడదుంపల ముద్ద – అర కప్పు(మెత్తగా ఉడికించి చేసుకోవాలి), మైదాపిండి – పావు కప్పు, నీళ్లు – కొద్దిగా, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, కొబ్బరి పాలు – ఒకటిన్నర కప్పులు, ఉప్పు – అర టీ స్పూన్, పంచదార – అర కప్పు, లేత కొబ్బరి గుజ్జు – ఒకటిన్నర కప్పులు
తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో బియ్యప్పిండి, చిలగడదుంపల ముద్ద, మైదాపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్‌ చేసుకుని మరుగుతున్న నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. నూనెలోంచి తీస్తూనే చల్లటి వాటర్‌లో వేసి మూడు నాలుగు నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత మళ్లీ స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. మరో పాత్ర తీసుకుని అందులో కొబ్బరి పాలు, ఒక కప్పు నీళ్లు వేసుకుని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, పంచదార, లేత కొబ్బరి గుజ్జు ఒకదాని తర్వాత ఒకటి రెండు మూడు నిమిషాలు గ్యాప్‌ ఇస్తూ.. గరిటెతో తిప్పుతూనే వేసుకోవాలి. చివరిగా రైస్‌ బాల్స్‌ కూడా అందులో వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అలా కాసేపు ఉడికిన తర్వాత బౌల్‌లోకి తీసుకుని సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.
సేకరణ: సంహిత నిమ్మన

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top