వారఫలాలు

Varafalalu of the week 19-05-2019 - Sakshi

19 మే నుంచి 25 మే 2019 వరకు

16 జూన్‌ నుంచి 22 జూన్‌ 2019 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న పనుల్లో కొంత జాప్యం జరిగినా పట్టుదలతో పూర్తి చేస్తారు. విద్యా, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆరోగ్యసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితిలో చెప్పుకోతగినంతగా మార్పు ఉండదు. అయితే అవసరాలకు లోటు రాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో విజయం. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో వివాదాలు. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కొన్ని సంఘటనలకు ఆశ్చర్యచకితులవుతారు. ఆలయాలు,ఆశ్రమాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు కొంత అనుకూలించకపోయినా నేర్పుగా పనులు చక్కదిద్దుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఈతిబాధలు, సమస్యలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకుపచ్చ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త పనులు చేపట్టి దిగ్విజయంగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి.  కుటుంబంలో మీ నిర్ణయాలకు ఎదురుండదు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపార లావాదేవీలు మరింత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో మీరు కోరుకున్న మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి విశేష గుర్తింపు రాగలదు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యతిరేకులు కూడా మీ మాటకు ఎదురుచెప్పలేని పరిస్థితి. ఆర్థిక విషయాలలో గతం కంటే పుంజుకుంటారు ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు. బంధువులతో వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు విజయవంతమవుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గులాబి, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
వారారంభంలో నెలకొన్న ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగినా అధిగమించి ముందడుగు వేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. కొన్ని దీర్ఘకాలిక వివాదాలు నైపుణ్యం, తెలివిగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఉద్యోగాలలో మరింత అనుకూలమైన పరిస్థితి. వారం ప్రారంభంలో బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. నేరేడు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. అనుకున్న పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. నిరుద్యోగులు, విద్యార్థులు భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్య, కుటుంబసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. అయినా లెక్కచేయరు. మీ లక్ష్యాలు సాధించడంలో జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. పరిశోధకులకు శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. రాజకీయవర్గాలకు పదవీయోగం, సన్మానాలు. వారం చివరిలో తీర్థయాత్రలు. వ్యయప్రయాసలు. ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న పనులు ముందుకు సాగక కొంత నిరాశ చెందుతారు. సోదరులతో ఆస్తి వ్యవహారాలలో వివాదాలు నెలకొనే అవకాశం. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు మందగిస్తాయి. ఒక వ్యక్తి ద్వారా కొంత సహాయం పొందుతారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. మీ నిర్ణయాలు తరచు మార్చుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
వీరికి అన్ని విధాలా అనుకూల సమయం. ఆర్థికంగా గతం కంటే మరింత బలం చేకూరుతుంది. విద్యార్థులు సత్తా చాటుకుని మంచి ఫలితాలు సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చాకచక్యంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉండి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో సమర్థత నిరూపించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. గులాబి, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. మీ ఆశయాల సాధనలో కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. నేర్పుగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు పొందుతారు. కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. వ్యతిరేకులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వివాహాది వేడుకలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విశేష ప్రగతి తథ్యం. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పనులు చకచకా పూర్తి కాగలవు. ఎంతటి వారినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు. విద్యార్థులు నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. ఆస్తుల విషయంలో సోదరులతో సర్దుబాటు వైఖరి అనుసరిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. వ్యాపారాలు వృద్ధిబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులు పరిచయం కాగలరు. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు సైతం మీపట్ల ఆకర్షితులవుతారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో

16 జూన్‌ నుంచి 22 జూన్, 2019 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
కొత్త అవకాశాలు అనుకోకుండా కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి పరిస్థితులు అనుకూలం. కొందరికి పదోన్నతలు దక్కే సూచనలు ఉన్నాయి. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. కుటుంబం నుంచి ఒత్తిళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అలకలు పెరిగి తీవ్ర మనస్పర్థలకు దారితీసే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అకాల భోజనం కారణంగా ఆరోగ్యం మందగించే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఇంటా బయటా పనులలో తలమునకలుగా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా పని భారం పెరుగుతుంది. చివరి నిమిషం వరకు తాత్సారం చేయకుండా సకాలంలో పనులు ముగించడమే క్షేమం. ఉద్యోగులకు స్వల్ప ఆర్థిక ప్రయోజనాలు దక్కవచ్చు. ప్రేమికుల నడుమ బీటలు పడిన అనుబంధాన్ని తిరిగి పటిష్టం చేసుకోవడానికి స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోతారు. ఇంట్లోని వృద్ధుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వివాదాల్లో చిక్కుకునే సూచనలు ఉన్నాయి. సంయమనం పాటించడం మంచిది.
లక్కీ కలర్‌: గోధుమ రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఇటో అటో తేల్చుకోవలసిన పరిస్థితులు తలెత్తుతాయి. ఒక నిర్ణయానికి రావడం విషమ పరీక్షలా మారుతుంది. ఆచి తూచి తీసుకున్న నిర్ణయాలతో పరిస్థితులను అతి కష్టం మీద చక్కదిద్దుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థుల నుంచి చిక్కులు తలెత్తినా, మీ ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు, ఉన్నతాధికారుల ఆదరణ దక్కుతాయి. ఆకస్మికంగా వచ్చిన ప్రేమ ప్రతిపాదనపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. స్వల్ప కాలిక పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు. సమస్యల్లో ఉన్న చిరకాల మిత్రుని ఆదుకుంటారు. సుదూర పర్యటనలకు ప్రణాళికలు వేసుకుంటారు.
లక్కీ కలర్‌: గులాబి

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
సాధించిన విజయాలేవీ సంతృప్తినివ్వవు. ఆత్మావలోకనం చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కీలక బాధ్యతలను చేపడతారు. త్వరలోనే ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సర్వం సిద్ధం చేసుకుంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. బృహత్‌ లక్ష్యాన్ని సాధించడానికి అకుంఠిత దీక్షతో కృషి కొనసాగిస్తారు. సామాజిక సేవా సంస్థలకు చేయూతనిస్తారు. వాటి కార్యక్రమాల్లో స్వయంగా పాలు పంచుకుంటారు. కుటుంబ సభ్యులతో కలసి సుదూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: నారింజ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
పని ఒత్తిడి ఎలా ఉన్నా, వృత్తి ఉద్యోగాల్లోని విధి నిర్వహణకూ కుటుంబ బాధ్యతలకూ నడుమ సమతుల్యతను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తారు. సాధించిన విజయాలు సంతృప్తినిస్తాయి. పరిస్థితులన్నీ సానుకూలంగానే ఉన్నా, భవిష్యత్తుపై అర్థంలేని అభద్రతాభావానికి లోనవుతారు. సన్నిహితుల ఆప్యాయతను ఆస్వాదిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం కొంత మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార నియమాలను పాటించడం, వ్యాయామం కొనసాగించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకోగలుగుతారు.
లక్కీ కలర్‌: తెలుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఇంటికి కొత్త అలంకరణలు చేయిస్తారు. చాలాకాలంగా కొనసాగిస్తున్న దీర్ఘకాలిక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సుదూర ప్రయాణాలు చేస్తారు. ప్రత్యర్థులు ప్రచారం చేసే వదంతులు మనస్తాపం కలిగిస్తాయి. ప్రేమ వ్యవహారాలకు పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అధ్యయనం, పరిశోధనలపై దృష్టి సారిస్తారు. నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక పురోగతి కోసం గురువులను ఆశ్రయిస్తారు.
లక్కీ కలర్‌: నేరేడు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఉద్విగ్నభరితమైన కాలాన్ని ఆస్వాదిస్తారు. ఇంటా బయటా సందడి సందడిగా పనుల్లో తలమునకలవుతారు. వేడుకల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు చక్కబడతాయి. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. భారీ స్థాయి కార్యక్రమాల నిర్వహణలో దక్షతను చాటుకుంటారు. ఒడిదుడుకుల నుంచి తేరుకుంటారు. వరుస అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషభరితంగా గడుపుతారు. పిల్లలు సాధించిన విజయాలకు గర్విస్తారు. కాలంతో పోటీ పడి మరీ లక్ష్యాలను సాధిస్తారు. ప్రియతములను ఆశ్చర్యంలో ముంచెత్తుతారు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
వరుస విజయాలతో దూసుకుపోతారు. వృత్తి ఉద్యోగాల్లో నాయకత్వ పటిమను రుజువు చేసుకుంటారు. తగిన దిశా నిర్దేశం చేసి మీ బృందాన్ని లక్ష్యాల వైపు నడిపిస్తారు. స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త కార్యక్రమాలను చేపడతారు. సంస్థలోని ప్రతిభావంతులను ప్రోత్సహిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. శరీర ఆకృతిని తీర్చిదిద్దుకోవడానికి వ్యాయామం ప్రారంభిస్తారు. వస్త్రాలంకరణలో మార్పులు చేసుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రియతములను కానుకలతో ఆకట్టుకుంటారు.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఇప్పటి వరకు కమ్ముకున్న చీకట్లు తొలగిపోతాయి. బతుకుబాటలో కొత్త వెలుగులు ప్రసరిస్తాయి. త్వరలోనే శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. జరుగుతున్న పరిణామాల పట్ల సంతృప్తితో ఉంటారు. ఆత్మవిశ్వాసంతో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అదృష్టం కలసి వచ్చే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కళా సాంస్కృతిక రంగాల్లోని వారికి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు విదేశీ అవకాశాలు కలసి వస్తాయి. ప్రేమికుల మధ్య తలెత్తిన పొరపొచ్చాలు తేలికగానే సమసిపోతాయి.
లక్కీ కలర్‌: వెండి రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
దీక్షా దక్షతలను నిరూపించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత భవితవ్యం కోసం కొత్త దార్శనికతతో ముందుకు సాగుతారు. స్వయంకృషితో పరిస్థితులను సానుకూలంగా మలచుకుంటారు. వినూత్న కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటారు. పాత బకాయిలను తీర్చేస్తారు. ఆత్మీయుల నుంచి కానుకలు అందుకుంటారు. చాలాకాలంగా న్యాయస్థానాల్లో నలుగుతున్న ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పురోగతం వేగం పుంజుకుంటుంది. ముందుచూపుతో పెట్టిన స్వల్పకాలిక పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
అనుకున్న ఫలితాల కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదు. స్వల్ప నిరీక్షణ తర్వాత అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లోని పరిస్థితులకు సంబంధించిన భ్రమలు తొలగిపోతాయి. కీలకమైన సమయంలో దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆత్మీయుల ప్రవర్తనలోని ఆకస్మిక మార్పు మనస్తాపం కలిగిస్తుంది. సన్నిహితులతో వాగ్వాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు.
లక్కీ కలర్‌: నీలం

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కోవడానికి సర్వ సన్నద్ధంగా ఉంటారు. భయాలను జయిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ విజయపథంలో దూసుకుపోతారు. సామాజిక కార్యక్రమాల్లో తలమునకలుగా ఉంటారు. సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పని ఒత్తిడి నుంచి కాస్త ఆటవిడుపుగా సుదూర ప్రయాణాలకు బయలుదేరుతారు. క్రీడలపై ఆసక్తి పెంచుకుంటారు. కొత్త భాషలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు.
లక్కీ కలర్‌: పసుపు
ఇన్సియాటారో అనలిస్ట్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top