రౌండ్ కట్ బ్లౌజ్ డిజైన్ | Round-cut blouse design | Sakshi
Sakshi News home page

రౌండ్ కట్ బ్లౌజ్ డిజైన్

Mar 27 2016 12:47 AM | Updated on Apr 3 2019 4:38 PM

రౌండ్ కట్ బ్లౌజ్ డిజైన్ - Sakshi

రౌండ్ కట్ బ్లౌజ్ డిజైన్

చాలామంది చీరల ఎంపిక మీద పెట్టిన శ్రద్ధ బ్లౌజ్ డిజైనింగ్‌పై పెట్టరు. హెవీ వర్క్స్ గురించి ఆలోచిస్తారే తప్ప సరైన ఫిటింగ్ గురించి పట్టించుకోరు.



 చాలామంది చీరల ఎంపిక మీద పెట్టిన శ్రద్ధ బ్లౌజ్ డిజైనింగ్‌పై పెట్టరు. హెవీ వర్క్స్ గురించి ఆలోచిస్తారే తప్ప సరైన ఫిటింగ్ గురించి పట్టించుకోరు. బ్లౌజ్ డిజైన్ గురించి అవగాహన పెంచుకుంటే ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. సొంతంగానే బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు. ఈ వారం షేప్‌లెస్ రౌండ్ కట్ బ్లౌజ్ డిజైన్ ఎలాగో నేర్చుకుందాం...
 
 పేపర్ చార్ట్ మీద బ్లౌజ్ డిజైన్ తీసుకొని, తర్వాత దాని కొలతలను బట్టి, క్లాత్‌ను కట్ చేసుకుంటే కటింగ్ సరిగ్గా వస్తుంది.
 
 మీటర్ పొడవుండే ఒక పేపర్ చార్ట్, గుర్తు పెట్టడానికి టైలర్స్ చాక్ (మార్కింగ్ చేసుకోవడానికి వీలుగా చాక్‌పీస్), టేపు, కత్తెర తీసుకోండి.  చార్ట్‌ను నిలువుగా మధ్యకు మడవాలి  మీ ఛాతి చుట్టుకొలత 34 అయితే (పైన అన్ని ఛాతి చుట్టుకొలతల చార్ట్ ఇచ్చాం. పరిశీలించండి) నిలువుగా ముందు భాగం స్టాండర్డ్ లెంగ్త్ 13 1/2 అంగుళాలు (ఇంచులు) తీసుకోవాలి. వెనుకభాగం 14 అంగుళాలు ఉండాలి.
 
  చుట్టుకొలత ముందు భాగం 14, వెనకభాగం 14 అంగుళాలు తీసుకోవాలి.
  డీప్ నెక్ (వెనకవైపు) - 10 1/2 అంగుళాలు. ఫ్రంట్ నెక్ 12 1/2 అంగుళాలు.
 
  భుజాలు 6 1/2 అంగుళాలు
  షార్ట్ స్లీవ్స్ (పొట్టి చేతులు) - 4 అంగుళాలు
  ఆర్మ్ హోల్(చంకభాగం) చుట్టుకొలత - 8 1/2
  ముందు భాగంలో డార్ట్స్ డ్రాఫ్టింగ్ పాయింట్స్ డ్రా చేయాలి.
  ముందువైపు చెస్ట్ పార్ట్‌ని సమంగా విడదీయాలి. అంటే, 34లో సగం 17 అంగుళాల కొలత తీసుకొని కట్ చేయాలి.  పూర్తిగా కొలతలు గీసుకున్నాక అర్థమవ్వడానికి పెన్ను లేదా చాక్‌పీస్‌తో ఆయా భాగాల పేర్లు రాసుకోవాలి.
 
 క్లాత్ మీద:   ఫ్యాబ్రిక్‌ని నిలువుగా మధ్యకు  టేబుల్ మీద ముడతలు లేకుండా సరిచేయాలి  దీని మీద కొలతల ప్రకారం కట్ చేసిన పేపర్ నమూనాలను ఉంచాలి  దీని ప్రకారం క్లాత్‌ను కట్ చేసుకోవాలి. (కట్ చేయడానికి ముందు పేపర్ కన్నా 1 1/2 అంగుళం సైడ్ మార్జిన్ వదలాలి. కుట్టేటప్పుడు అర అంగుళం వదలాలి.
 
 లైనింగ్ బ్లౌజ్ అయితే...
 కొలతలను డ్రా చేసుకున్న పేపర్ చార్ట్‌ను ముందుగా కట్ చేసుకున్నాక దానిని బట్టి లైనింగ్ క్లాత్‌ను కత్తిరించాలి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్‌ను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి, కట్ చేసుకోవాలి. లైనింగ్, సిల్క్ ఫ్యాబ్రిక్ ఒకేసారి పెట్టి కట్ చేస్తే కొలతల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంది.
  హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయించాలంటే...
 
 క్లాత్‌ని కట్ చేయడానికి ముందు కొలతలు వేసి, దాని ప్రకారం డిజైన్ చేయించుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement