హెల్త్‌కార్నర్ | Health Corner | Sakshi
Sakshi News home page

హెల్త్‌కార్నర్

May 15 2016 2:44 AM | Updated on Sep 4 2017 12:06 AM

హెల్త్‌కార్నర్

హెల్త్‌కార్నర్

తరచూ చెవి నొప్పితో బాధపడేవారు.. చెంచా ఉల్లిరసంలో అరచెంచా తేనె వేసి బాగా కలిపి ఓ సీసాలో పెట్టుకోవాలి.

* తరచూ చెవి నొప్పితో బాధపడేవారు.. చెంచా ఉల్లిరసంలో అరచెంచా తేనె వేసి బాగా కలిపి ఓ సీసాలో పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా 5-10 చుక్కలు నొప్పిగా ఉన్న చెవిలో వేసుకుంటే.. మంచి ఉపశమనాన్ని పొందుతారు.
 
* ఎండలో లేక దుమ్ముగా ఉన్న ప్రాంతాల్లో తిరిగినప్పుడు చాలామందికి కళ్లు ఎర్రగా మారి మంట పుడుతుంటాయి. అలాంటప్పుడు కంటిలో రెండు చుక్కల స్వచ్ఛమైన రోజ్ వాటర్ వేసుకుంటే చాలు.. కొద్ది క్షణాల్లో మంట తగ్గుతుంది.
 
* రోజూ రాత్రి పడుకునే ముందు తాగితే.. సైనస్ కారణంగా బాధించే తలనొప్పి మటుమాయం అవుతుంది..

* తరచూ చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నట్లయితే.. రోజూ బ్రష్ చేసుకున్న తర్వాత, అలాగే రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో చిగుళ్లకు మర్దనా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది.
 
* రుతుక్రమం సమయంలో కడుపు, నడుము నొప్పితో బాధపడేవారు.. చెంచా అలోవెరా జెల్‌లో చిటికెడు నల్ల మిరియాల పొడిని కలిపి రోజుకు మూడు పూటలా తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది..
 
* నోటి దుర్వాసనను దూరం చేసుకోవాలంటే.. ఒక తమలపాకులో రెండు లవంగాలు పెట్టుకొని తింటే సరిపోతుంది. ఇలా రోజుకు ఒక్కసారి మాత్రమే చేయాలి. లవంగానికి బదులుగా వక్కను కూడా ఉపయోగించొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement