బాలీవుడ్ భామలను ఆకర్షిస్తున్న టాలీవుడ్ హీరో! | bollywood heroins attract to act with mahesh babu | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ భామలను ఆకర్షిస్తున్న టాలీవుడ్ హీరో!

Mar 11 2014 2:22 PM | Updated on Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ భామలను ఆకర్షిస్తున్న టాలీవుడ్ హీరో! - Sakshi

బాలీవుడ్ భామలను ఆకర్షిస్తున్న టాలీవుడ్ హీరో!

వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ హీరో మహేష్ బాబుతో జతకట్టేందుకు బాలీవుడ్ భామలుఎగబడుతున్నారు.

వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ హీరో మహేష్ బాబుతో జతకట్టేందుకు బాలీవుడ్ భామలు ఎగబడుతున్నారు. టాలీవుడ్ లో నటించడం కంటే బాలీవుడ్ లో నటించడమంటే మన హీరోయిన్లకి ఆసక్తి ఎక్కువ. బాలీవుడ్ లో పాగా వేస్తే ఇక తమకు ఎదురులేదని ఇక్కడి భామలు భావిస్తుంటారు.

 

అటువంటిది ఇప్పుడు ఆ ఆనవాయితీ మారనుందా? అంటే అవుననే చెప్పకతప్పదు. టాలీవుడ్ పాలబుగ్గల చిన్నోడు మహేష్ తో నటించడానికి బాలీవుడ్ భామలు తామంటే తామని పోటీ పడుతూ క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఆ రేసులో సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, కంగనా రనౌత్ లు ఉన్నారు. దర్శకులు తగిన కథను సిద్ధం చేస్తే మహేష్ తో నటించడానికి తమకేమీ అభ్యంతరం లేదని వారు చెబుతున్నారు.

 

నార్త్ హీరోయిన్స్ ను తమ సినిమాల్లో పెట్టుకోవడాన్ని క్రేజ్ గా భావించే టాలీవుడ్ డైరెక్టర్లకు ఇదొక మంచి పరిణామమే.  బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం ఇప్పుడేమీ కొత్త కాకపోయినా,  ప్రస్తుతం ఉన్న యువ హీరోయిన్లు మహేష్ తో జోడీకి కట్టడానికి ఎగబడటం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.   ప్రస్తుతం 'ఆగడు' చిత్రంతో బిజీగా ఉన్న మహేష్.. ఆ ముద్దుగుమ్మల మాటల్ని ఆలకించి అవకాశం ఇస్తాడా?లేదా?అనేది వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement