నాలుకలుక | tongue Twisters special for summer special | Sakshi
Sakshi News home page

నాలుకలుక

May 5 2016 11:55 PM | Updated on Sep 3 2017 11:28 PM

నాలుకలుక

నాలుకలుక

వీటిని ఇంగ్లిష్‌లో టంగ్ ట్విస్టర్స్ అంటారు. నాలుక ఎన్ని రకాలుగా తిరుగుతుందంటే ముడులు పడే ప్రమాదం ఉంది.

 సమ్మర్ స్పెషల్

వీటిని ఇంగ్లిష్‌లో టంగ్ ట్విస్టర్స్ అంటారు. నాలుక ఎన్ని రకాలుగా తిరుగుతుందంటే ముడులు పడే ప్రమాదం ఉంది. సమ్మర్‌కి సరదాగా మూడ్‌కి సరిగా ఉంటుందనుకుని ఈ ముళ్లు మీ కోసం...

 మేకతోకకు మేక తోకమేకకు మేక
మేక తోకకు తోక తోకమేక
మేక తోకకు మేక తోకమేకకు మేక
మేకతోకకు తోక తోకమేక
మేక తోకకు మేక తోకమేకకు మేక
మేకతోకకు తోక తోకమేక
మేక తోకకు మేక తోకమేకకు మేక
మేక తోకకు తోక తోకమేక
మేక తొకతోక తొకతోక తోకమేక
మేక తొకతోక తొకతోక తోకమేక
మేక తొకతోక తొకతోక తోకమేక
మేక తొకతోక తొకతోక తోకమేక

వికటకవి తెనాలి రామకృష్ణుడి పద్యం ఇది. ఒక పండితుడిని ఆటపట్టించడానికి ఈ పద్యం చదివాడని ప్రతీతి. మేక, తోక అనే రెండు పదాలతోనే చెప్పిన ఈ పద్యంలో ఎలాంటి అర్థం లేదు. అయితే, ఇలాంటి పద్యాన్ని వడివడిగా చదవడం నాలుకకు సవాలే!

నరసింహ కృష్ణరాయని
కర మరుదగు కీర్తియొప్పె గరిభిద్గిరిభి
త్కరి కరిభిద్గిరి గిరిభి
త్కరి భిద్గిరిభిత్తురంగ కమనీయంబై

ఇది కూడా వికటకవిగారి పద్యమే. కృష్ణదేవరాయలి కీర్తిని పొగుడుతూ చెప్పాడు ఈ పద్యాన్ని.  కృష్ణరాయల కరానికి... అంటే చేతికి అరుదైన కీర్తి అబ్బిందట. ఆ కీర్తి ఎలాంటి మచ్చలేని ధవళకాంతితో ప్రకాశిస్తోందట. ఆ ధవళ కాంతి ఎలాంటిదంటే... కరిభిత్- అంటే ఏనుగును (గజాసురుడిని) చంపిన వాడు శివుడు. శివుడి మేనిఛాయ తెలుపు.

గిరిభిత్ కరి- అంటే పర్వతాలను పిండి పిండి చేసిన ఏనుగు (ఇంద్రుడి వాహనమైన ఐరావతం). ఐరావతం రంగు తెలుపు. ఇక గిరిభిత్- పర్వతాలను భేదించిన ఇంద్రుడి వజ్రాయుధం కూడా తెలుపే. కరిభిత్ గిరి- అంటే మంచుతో కప్పబడిన కైలాస పర్వతం. ఇది హిమ ధవళకాంతితోనే ఉంటుంది. కరిభిత్ తురంగ- శివుడి వాహనమైన నంది, గిరిభిత్ తురంగ అంటే.. ఇంద్రుడి అశ్వమైన ఉచ్ఛైశ్రవం తెల్లగానే ఉంటాయి. కృష్ణదేవరాయల కీర్తి వన్నె వీటికి సాటి వస్తుందని కవిహృదయం.

నాలుగు నల్ల లారీలు ఆరు ఎర్ర లారీలు

కాకీక కాకికి కాక కేకికా?

నానీ నా నూనె నీ నూనెని నేనన్నానా?
నా నూనె నా నూనే నీ నూనె నీ నూనే

 లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక్క భక్షము లక్ష్యమా!

గాదెలోన కందిపప్పు
గాదె కింద పందికొక్కు

అక్షరంబు వలయు కుక్షి జీవనులకు
నక్షరంబు జిహ్వకిక్షురసము
అక్షరంబు తన్ను రక్షించుగావున
నక్షరంబు లోక రక్షితంబు

అక్షరం అనే పదాన్ని చదువు అనే అర్థంలో వాడాడు కవి. ఈ కవి ఎవరో తెలియదు. మనుషులందరికీ చదువు కావాలి. చదువు నాలుకకు చెరకురసం లాంటిది. చదువే మనకు శ్రీరామరక్ష. అందుకని చదువును మనం రక్షించుకోవాలి అంటూ చెప్పిన ఈ పద్యం నాలుకకు మంచి వ్యాయామాన్నే ఇస్తుంది.

నడవకయె నడచి వచ్చితి
నడచిన నే నడచి రాను నడచెడునటులన్
నడిపింప నడవనేరను
నడవడికలు చూచి నన్ను నడిపింపరయా

 ఈ పద్యం చెప్పిన కవి ఎవరో తెలియదు. ఆయన పేదరికంలో మగ్గుతూ ఉండేవాడని ఈ పద్యమే చెబుతోంది. కుటుంబ పోషణ నడవకపోవడం వల్లనే కాలినడకన వచ్చాడట. కుటుంబ పోషణ సజావుగా ఉంటే, అంత దూరం నడిచి వచ్చేవాడు కాడట. తన నడవడికను గమనించి, తన కుటుంబాన్ని నడిపించే శక్తి కలిగేలా తనను ఆదుకోవాలంటూ వేడుకున్నాడు ఆ కవి.

హిందీ
చందు కె  చాచా నె చందు కి చాచీ కో చాందినీ చౌక్ మే చాందీ కి చమ్మక్ సే చట్నీ చకాయీ.

Advertisement
 
Advertisement
Advertisement