లైపోసక్షన్ సహాయంతో బరువు తగ్గించుకోవడం సాధ్యమే.
నా బరువు 98 కిలోలు. చాలా లావుగా కనిపిస్తున్నాను. లైపోసక్షన్ సహాయంతో నా బరువు తగ్గించుకోవడం సాధ్యమేనా? ఒక్క సెషన్‌లోనే అంతా చక్కబడుతుందా?
- వెంకటేశ్, వరంగల్
లైపోసక్షన్ సహాయంతో బరువు తగ్గించుకోవడం సాధ్యమే. అయితే ఎత్తును బట్టి చూసినప్పుడు ఉన్న అదనపు బరువునంతా ఒకే సెషన్‌లో తీసేయడం మంచిది కాదు. ఒక సురక్షితమైన స్థాయి వరకు మాత్రమే కొవ్వును తొలగిస్తారు. అలా మిమ్మల్ని పరీక్షించాక మాత్రమే శరీరంలోని అదనపు బరువును దఫాలవారీగా తొలగించడానికి నిపుణులు తగిన ప్లాన్ నిర్ణయిస్తారు.
డాక్టర్ దీపు సీహెచ్
ప్లాస్టిక్ సర్జన్, ఒలివా కాస్మటిక్ సర్జరీ సెంటర్, హైదరాబాద్