పసందుగా పండగ

manchu lakshmi prasanna sankranthi special - Sakshi

ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులతో సంక్రాంతి సంబరాలను తన నివాసంలో జరుపుకున్నారు నటి, నిర్మాత మంచు లక్ష్మీప్రసన్న. టీచ్‌ ఫర్‌ చేంజ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జంట నగరాల్లోని 38 ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 50 మంది విద్యార్థులు మంచు లక్ష్మీ నివాసానికి చేరుకుని, సందడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, టీచ్‌ ఫర్‌ చేంజ్‌ వాలంటీర్లకు సంక్రాంతి విందు భోజనాన్ని వడ్డించారు మంచు లక్ష్మీ. ‘‘ప్రతి ఏడాది ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు విద్యార్థులను తీసుకెళ్లి సంక్రాంతి వేడుకలను జరుపుకునేవాళ్లం. కానీ ఈ ఏడాది సంక్రాంతిని మా ఇంట్లోనే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు లక్ష్మీప్రసన్న. కుమార్తె విద్యా నిర్వాణతో కలసి పిల్లలందరితో లక్ష్మీప్రసన్న సెల్ఫీ దిగారు.

‘జయం’ రవి, నివేతా పేతురాజ్‌ నటించిన చిత్రం ‘టిక్‌.. టిక్‌. టిక్‌’. ఈ నెల 26న విడుదల కానున్న ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. మూవీ ప్రమోషన్‌లో భాగంగా సంక్రాంతి సెలబ్రేషన్స్‌ చేశారు ‘జయం’ రవి, నివేతా, సంగీత దర్శకుడు ఇమ్మాన్‌ తదితరులు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top