రారండోయ్‌

Literature Events In Telugu States - Sakshi
  • కలేకూరి ప్రసాద్‌ స్మారక సాహిత్య జయంతి సభ ఆక్టోబర్‌ 25న కృష్ణా జిల్లా కంచికచర్ల మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల కవులు, రచయితలు పాల్గొంటారు. నిర్వహణ: తంగిరాల సోని.
  • సాహిత్యంలో జీవన సాఫల్య కృషికి గానూ 2018 సంవత్సరానికి ఇంద్రగంటి శ్రీకాంతశర్మకు ‘శిఖామణి సాహితీ పురస్కారం’ ప్రదానం అక్టోబర్‌ 28న సాయంత్రం 5 గంటలకు యానాంలో జరగనుంది. పురస్కార నగదు పదివేలు. ఇందులోనే ‘శిఖామణి సాహిత్య సర్వస్వం– సంపుటం 4’, ‘శిఖామణి పీఠికలు’ ఆవిష్కరణ కూడా జరగనుంది. మల్లాడి కృష్ణారావు, డాక్టర్‌ డి.విజయభాస్కర్, కె.శివారెడ్డి పాల్గొంటారు. నిర్వహణ: కవిసంధ్య, యానాం.
  • కందాళై రాఘవాచార్య కవితా సంపుటి ‘ఏకధార’ ఆవిష్కరణ అక్టోబర్‌ 26న సాయంత్రం 5 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఆవిష్కర్త: కె.వి.రమణాచారి. నందిని సిధారెడ్డి, మామిడి హరికృష్ణ పాల్గొంటారు. నిర్వహణ: తేజ ఆర్ట్‌ క్రియేషన్స్‌.
  • ‘ప్రైడ్‌ ఓవర్‌ ప్రెజుడీస్‌’ పేరుతో అక్టోబర్‌ 27 సా. 4 గం.లకు జరగనున్న సాహిత్య కార్యక్రమంలో డా. పి. శ్రీదేవి నవల ‘కాలాతీత వ్యక్తులు’పై చర్చిస్తారు. పరిచయ కర్త: డా. కె.ఎన్‌. మల్లీశ్వరి. వేదిక: ఏపీటీడీసీ బోట్‌ జెట్టీ, బెర్మ్‌ పార్క్, విజయవాడ. వివరాలకు: సాయి పాపినేని.   ఫోన్‌: 98450 34442
  • సంగీత నేపధ్యమున్న మూడు కథలు – 1. వాయులీనం, 2. కానుక, 3.చూపున్న పాట – కథల గురించి చర్చా కార్యక్రమం అక్టోబరు 27న సాయంత్రం ‘ఆలంబన‘, బాలాజీ నగర్, కూకట్‌పల్లి విలేజ్‌ నందు జరగనుంది. నిర్వహణ : వేదిక. 
Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top