
- సన్నిధానం నరసింహశర్మ ఇంటర్వ్యూలు, సమీక్షలు, వ్యాసాల కలబోత ‘ప్రమేయఝరి’ పుస్తకం విడుదల సభ అక్టోబర్ 11న సాయంత్రం 5:30కు హైదరబాద్ స్టడీ సర్కిల్‌లో జరగనుంది. ఆవిష్కర్త జస్టిస్ టి.రజని. వయ్యి స్వీకృతి: జయధీర్ తిరుమలరావు. పొత్తూరి వెంకటేశ్వరరావు, సామల రమేశ్‌బాబు, గూడూరు మనోజ, ఎ.కె.ప్రభాకర్ పాల్గొంటారు. నిర్వహణ: సాహితీ సర్కిల్, హైదరాబాద్.
- ‘నందగిరి ఇందిరాదేవి కథలు’ ఆవిష్కరణ అక్టోబర్ 8న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో జరగనుంది. నందిని సిధారెడ్డి, ముదిగంటి సుజాతారెడ్డి, నందగిరి వీర, చీదెళ్ల సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి పాల్గొంటారు. నిర్వహణ: తెలంగాణ సాహిత్య అకాడమి.
- పుణే తెలుగు సాహితీ పీఠం నిర్వహణలో ‘రచయితల కార్యగోష్ఠి’ అక్టోబర్ 14న ఉదయం 10:30కు పుణే ఆంధ్ర సంఘం, పుణేలో జరగనుంది. అతిథి: నందిని సిధారెడ్డి. 40 మంది మహారాష్ట్ర కవుల ‘మరో అడుగు’ కవితా సంకలనం ఆవిష్కరణ కానుంది.
- గిడుగు రామ్మూర్తి భాషా సాహిత్య సేవా పురస్కారాల సభ అక్టోబర్ 10న ఉదయం 10 గంటలకు విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. ముఖ్య అతిథి: మండలి బుద్ధప్రసాద్. నిర్వహణ: నవ్యాంధ్ర రచయితల సంఘం.
- ర్యాలి ప్రసాద్ ‘ఆల్ఫా– ఒమేగా’ కవితా సంపుటికి 2018 సంవత్సరపు ఎ.ఎల్.ఫౌండేషన్ పురస్కారం లభించింది.
- ‘దేవులపల్లి కృష్ణశాస్త్రి స్మరణ– స్ఫురణ’ కార్యక్రమం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో అక్టోబర్ 13న సాయంత్రం 3 గంటలకు జరగనుంది. నిర్వహణ: సాంస్కృతీ సమాఖ్య
- శ్రీ కళా గౌతమి మాసపత్రిక అక్టోబర్ 28న కందుకూరి వీరేశలింగం శత వర్ధంతి సందర్భంగా రాజమండ్రిలోని నన్నయ విశ్వవిద్యాలయంలో కందుకూరి జీవితం ఆధారంగా రాసిన కవితలతో శతాధిక కవి సమ్మేళనం నిర్వహించనుంది. వివరాలకు వాట్సాప్ నంబరు 9885661850.