గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం | Guruvayur Sri Krishna Temple | Sakshi
Sakshi News home page

గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం

Mar 22 2016 11:10 PM | Updated on Sep 3 2017 8:20 PM

గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం

గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం

దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన కృష్ణాలయాల్లో ఒకటైన గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం కేరళలో ఉంది.

సందర్శనీయం


దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన కృష్ణాలయాల్లో ఒకటైన గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం కేరళలో ఉంది. త్రిసూర్ జిల్లాలోని చిన్నపట్టణమైన గురువాయూర్‌లో గల ఈ ఆలయం ఐదువేల ఏళ్ల నాటిదని అంచనా. అయితే, ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి చారిత్రక ఆధారాలూ లేవు. క్రీస్తుశకం 14-16 శతాబ్దాలకు చెందిన ‘కోకసందేశం’, ‘నారాయణీయం’ వంటి తమిళ సాహిత్య గ్రంథాలలో గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయ వర్ణన ఉంది. ప్రస్తుతం ఉన్న గర్భాలయం క్రీస్తుశకం 1638లో పునర్నిర్మాణానికి నోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి.


అప్పట్లోనే ఇది దక్షిణ భారత దేశంలో ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. సర్పయాగం చేసిన జనమేజయుడు సర్పాల శాప ఫలితంగా కుష్టువ్యాధిగ్రస్థుడయ్యాడని, దత్తాత్రేయుడి సూచన మేరకు గురువాయూర్‌లో మహావిష్ణువు కోసం తపస్సు చేసి, శాపవిమోచనం పొందాడని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయానికి ఉత్తరాన గల రుద్రతీర్థం వేల ఏళ్ల నాటి నుంచి ఉందని చెబుతారు. సాక్షాత్తు పరమశివుడు సకుటుంబ సమేతంగా ఇక్కడ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడని ప్రతీతి. శ్రీకృష్ణ జన్మాష్టమి, డోలాపూర్ణిమ సహా వైష్ణవ పర్వదినాలన్నీ ఇక్కడ వైభవోపేతంగా జరుగుతాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement