సొగసుకు సొన

Egg Health Is Better For Hair And Skin - Sakshi

బ్యూటిప్స్‌

గుడ్డు తింటే ఆరోగ్యం. కేశాలకు, చర్మానికి గుడ్డు వాడితే మెరుగైన అందం. ఒకసారి ఉపయోగిస్తే చాలు గుడ్డు మేనికి వెరీగుడ్‌ ఫేస్‌ అండ్‌ హెయిర్‌ ప్యాక్‌ అంటారు.

►బాగా మగ్గిన అరటిపండును వేళ్లతో గుజ్జు చేసి అందులో టేబుల్‌ స్పూన్‌ తేనె, గుడ్డులోని పచ్చసొన, అర టీ స్పూన్‌ బాదం నూనె, టీ స్పూన్‌ ఓట్స్, నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి మృదువుగా మర్దన చేయాలి. పది నిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్‌ పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

►గుడ్డులోని తెల్లసొన నాలుగైదు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్‌ వేసుకుంటే చర్మంపై ముడతలు తగ్గుతాయి.   

►కప్పు పెరుగులో పావు కప్పు పెసర పిండి, గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు, మాడుకు, శిరోజాలకు పట్టించాలి. పావు గంట తర్వాత తలస్నానం చేయాలి. ప్రతి మూడు రోజులకోసారి ఇలా నెలరోజుల పాటు చేస్తే చుండ్రు, జుట్టు రాలడం సమస్యలు తగ్గుతాయి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top