సరదా హద్దు దాటింది! | Crossed the border fun! | Sakshi
Sakshi News home page

సరదా హద్దు దాటింది!

Jun 15 2014 11:18 PM | Updated on Sep 2 2017 8:51 AM

సరదా హద్దు దాటింది!

సరదా హద్దు దాటింది!

వయసులో ఉన్న అమ్మాయిలు ప్రేమలో పడటం మామూలే. బాయ్ ఫ్రెండ్‌తో సరదాగా షికార్లు చేయాలని సరదా పడటమూ మామూలే. అయితే ఈ సరదా చైనాలో పెద్ద అనర్థమే తెచ్చిపెడుతోంది.

వీక్షణం
 
వయసులో ఉన్న అమ్మాయిలు ప్రేమలో పడటం మామూలే. బాయ్ ఫ్రెండ్‌తో సరదాగా షికార్లు చేయాలని సరదా పడటమూ మామూలే. అయితే ఈ సరదా చైనాలో పెద్ద అనర్థమే తెచ్చిపెడుతోంది. ఆడపిల్లల తల్లిదండ్రుల్ని బెంబేలెత్తిస్తోంది!
 
గత కొద్ది కాలంగా చైనా అమ్మాయిల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చిందని సర్వేలు చెబుతున్నాయి. జీవితంలో బాగా స్థిరపడిన తరువాతే పెళ్లి చేసుకోవాలని వారు అనుకుంటు న్నారట. ప్రేమ, పెళ్లి వంటి వాటికి సమయం కేటాయించలేక పోతున్నారట.
 
అలాంటి వారికోసం కొత్త రకం సంస్థలు వెలిశాయి. అవేం చేస్తున్నాయో తెలుసా? పార్టీలకు, పిక్నిక్‌లకు వెళ్లడానికి బాయ్‌ఫ్రెండ్‌‌సని అద్దెకిస్తున్నాయి. గంటకింత, రోజుకింత అంటూ వసూలు చేస్తున్నాయి. దాంతో అమ్మాయిలు రుసుము చెల్లించి బాయ్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకుంటున్నారు. ఆ సమయం కాస్తా గడిచాక తమ చదువు, వృత్తులలో మునిగిపోతున్నారట! దాంతో ఆడపిల్లల తల్లిదండ్రులు అవాక్కయ్యి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారట! మరి ప్రభుత్వం ఇలాంటి సంస్థల మీద ఏ యాక్షన్ తీసుకుంటుందో చూడాలి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement