ఒక్క మందుతో మారే కేన్సర్‌ కణాలు!

Cancer cells that change with one drug - Sakshi

పరి పరిశోధన

కేన్సర్‌ కణాల ప్రత్యేకత ఏమిటి? అడ్డుఅదుపు లేకుండా విభజితమవుతూ పోవడం. ఈ విచ్చలవిడి విభజనకు అడ్డు కట్ట వేస్తే..? కేన్సర్‌ ముదరదు. మరి.. ఒక్క మందు వేసి కేన్సర్‌ కణాలన్నింటినీ సాధారణ కణాలుగా మార్చేస్తే...? రోగమన్నది ఉండదు! ఓ వినూత్నమైన రసాయనంతో తాము అచ్చంగా ఇదే సాధించామంటున్నారు బీజీఎన్‌ టెక్నాలజీస్‌ శాస్త్రవేత్తలు! ఇప్పటికైతే ఈ పరిశోధన ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ ఆ రసాయనం తాలూకు లక్షణాలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ సోశన్‌ బర్మాటాజ్‌ అంటున్నారు. మన డీఎన్‌ఏలో ఉండే రెండు పోగుల్లో ఒకదాన్ని వేరు చేస్తే వచ్చే ఆర్‌ఎన్‌ఏ ఆధారంగా ఈ చికిత్స జరుగుతుంది.

కణాల్లోని మైటోకాండ్రియాను రక్షించే ప్రొటీన్‌ వీడీఏసీ1 పనితీరును ఈ సై ఆర్‌ఎన్‌ఏ ప్రభావితం చేస్తుందని, కణుతులతో కూడిన, కణుతులు లేని కేన్సర్లలో ఈ ప్రొటీన్‌ చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని ప్రొఫెసర్‌ సోశన్‌ తెలిపారు. కేన్సర్‌ కణాలకు అవసరమైన ఎక్కువ శక్తిని ఈ ప్రొటీన్‌ అందిస్తుందని వివరించారు. వీడీఏసీ1 ప్రొటీన్‌ ఉత్పత్తిని నిలిపివేయడంతో కేన్సర్‌ కణాల పెరుగుదల కూడా ఆగిపోయిందని, అదే సమయంలో ఇతర కణాలకు ఎలాంటి హానీ జరగలేదు. గ్లియోబాస్టోమా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఎలుకల్లో ఈ పద్ధతి బాగా పనిచేసినట్లు సోశాన్‌ తెలిపారు. ఈ క్రమంలో కేన్సర్‌ కణాలు తమ లక్షణాలను కోల్పోయి సాధారణ కణాలుగా మారినట్లు గుర్తించామని వివరించారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top