బేబీస్ నైట్ అవుట్ | Babies Night Out | Sakshi
Sakshi News home page

బేబీస్ నైట్ అవుట్

Mar 30 2015 10:53 PM | Updated on Sep 2 2017 11:36 PM

బేబీస్ నైట్ అవుట్

బేబీస్ నైట్ అవుట్

‘లేడికి లేచిందే పరుగు... చిన్నారి అడిగిందో డ్రింకు’’ అంటూ ఆశ్చర్యపోయారు బస్సులోని సహప్రయాణీకులంతా.

చదివింత...

‘‘లేడికి లేచిందే పరుగు... చిన్నారి అడిగిందో డ్రింకు’’ అంటూ ఆశ్చర్యపోయారు బస్సులోని సహప్రయాణీకులంతా.  ఫిలడెల్ఫియాలో నివసించే నాలుగేళ్ల చిన్నారి అన్నాబెల్లెకి  తెల్లవారుఝామున 3 గంటలకు  మెలకువ వచ్చింది. అర్జంటుగా తనకెంతో ఇష్టమైన ఫ్రోజెన్ డ్రింక్ తాగాలనిపించింది. వెంటనే రెయిన్‌కోట్ వేసేసుకుని మరీ బయటకు వచ్చేసింది. దారిలో కనపడిన బస్సు ఎక్కేసింది. సీట్లో కూచుని కాళ్లూపుతూ ‘‘నాకో స్లాషీ (మంచుతో కప్పిన కూల్‌డ్రింక్) కావాలి’’ అంటూ ఆర్డరేసింది.

ఆ చిన్నారి ఎవరో ఏమిటో అర్ధం కాక తికమకపడిన  బస్సు ప్రయాణికులు విషయాన్ని బస్ డ్రైవర్  చెవిలో ఊదారు. దీంతో డ్రైవర్  పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు  ముందుగా ఆ బుడతని ఒక హాస్పిటల్‌కి తీసుకెళ్లి అక్కడ నుంచి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. అసలు అప్పటిదాకా పాప బయటకు వెళ్లిందనే విషయమే గమనించని తల్లి జాక్లిన్ మేజర్...‘‘ఊహించలేకపోతి నీ ‘పోక’... ఊపిరులూదింది నీ రాక’’ అంటూ అన్నాబెల్లిని అక్కున చేర్చుకుందట.
సత్యవర్షి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement