అవసరమైతే చంపడానికి కూడా వెనుకాడరు:కేజ్రీవాల్ | We expect real attacks after election, says aravind Kejriwal | Sakshi
Sakshi News home page

అవసరమైతే చంపడానికి కూడా వెనుకాడరు:కేజ్రీవాల్

Apr 14 2014 7:33 PM | Updated on Mar 29 2019 9:24 PM

అవసరమైతే చంపడానికి కూడా వెనుకాడరు:కేజ్రీవాల్ - Sakshi

అవసరమైతే చంపడానికి కూడా వెనుకాడరు:కేజ్రీవాల్

బీజేపీపై ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాషాయ పార్టీ నేతలు అధికారంలోకి వచ్చేందుకు ఎంతకైనా తెగిస్తారని, అవసరమైతే సొంత పార్టీ కార్యకర్తలను చంపడానికి కూడా వెనుకాడబోరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియతో మాట్లాడారు. హిందువులను, పిల్లలను చివరికి పార్టీ కార్యకర్తలను చంపడానికి కూడా బీజేపీ నేతలు సిద్ధపడతారని ఆరోపించారు.
 
 

వారికి ముస్లింలు, హిందువులనే తేడా లేదని, అధికారంలోకి వచ్చేందుకు ఎవరైనా ఒకటే అన్నారు. ప్రస్తుతం తనపైనా.. తన పార్టీ నేతలపైనా ఇంకు, కోడి గుడ్లు వేయడం.. కొట్టడం లాంటి ఘటనలు జరిగాయని, ఎన్నికల తర్వాత తమపై మరిన్ని తీవ్రమైన దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఎన్నికలు ఉన్నందున రాజకీయ పార్టీలు నిశ్శబ్దంగా ఉన్నాయని, ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రత్యర్థి పార్టీలు తమ అసలు రంగు బయటపెడతాయన్నారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement