అచ్చు తండ్రి పోలికే.. | Vowel sound like the father .. | Sakshi
Sakshi News home page

అచ్చు తండ్రి పోలికే..

Mar 24 2014 12:30 AM | Updated on Aug 29 2018 3:37 PM

అచ్చు తండ్రి పోలికే.. - Sakshi

అచ్చు తండ్రి పోలికే..

ఇప్పుడు టీడీపీలో నేతలంతా జూనియర్ ‘బాబు’ను చూసి తండ్రికి తగ్గ తనయుడేనని చెవులు కొరుక్కుంటున్నారు!

 ఇప్పుడు టీడీపీలో నేతలంతా జూనియర్ ‘బాబు’ను చూసి తండ్రికి తగ్గ తనయుడేనని చెవులు కొరుక్కుంటున్నారు! పార్టీ కోసం అది చేస్తా.. ఇది చేస్తా.. సైకిల్ ఎక్కేస్తా.. రాష్ట్రాన్ని దున్నేస్తా.. అని చెప్పి, చివరికి ఏదీ చేయుకుండా చేతులెత్తేశాడని గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ విషయు మేమిటంటే.. ఎన్నికల్లో గెలవడమెలా.. అన్న అంశంపై నారా లోకేష్ పార్టీ యుువకులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొన్ని వర్క్‌షాప్‌లు నిర్వ హించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు, జిల్లా కేంద్రాల్లో సదస్సులు పెట్టి ఎన్నికల్లో గెలవడమెలా అన్న దానిపై పాఠాలు చెబుతాన న్నారు. మొదట కర్నూలు, ఆ తర్వాత భూపాల పల్లి, తర్వాత గజ్వేల్ ఇలా సదస్సులుంటాయని పార్టీ నేతలకు లీకులిచ్చారు. కానీ నెలలు గడుస్తున్నా ఒక్క సదస్సూ పెట్టలేదు! తర్వాత కొద్ది రోజులకు సదస్సుల సంగతి మరిచిపోయి సైకిల్ యాత్ర చేస్తానంటూ కొత్త లీకులిచ్చారు. హిందూపురంలోని ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మొదలుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపడతానని, అందుకు సంబంధించిన షెడ్యూలూ విడుదల చేశారు.

ఈ యాత్ర కోసం లోకేష్ కొద్ది రోజులు ఇంట్లో, మరికొద్ది రోజులు హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్‌పై సైకిల్ తొక్కడం ప్రాక్టీస్ చేశారు. తమ నాయకుడొస్తున్నారని జిల్లాలోని యువ నేతలంతా కొత్త సైకిళ్లు, పార్టీ టీ షర్టులు.. కొనుక్కుని సిద్ధమయ్యారు. ఇప్పుడా సైకిళ్లు, టీ షర్టులన్నీ మూలన పడ్డాయి! ఇప్పుడేమో.. మీకు ఏ ఇబ్బందులున్నా నేరుగా నాతో మాట్లాడొచ్చని ఒక ఫోన్ నంబర్ ఇచ్చేశారు లోకేష్. యువ నేతతో మాట్లాడొచ్చని పలువురు నేతలు ఫోన్ చేస్తే ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా ఎత్తి హలో అన్న పాపాన పోలేదట! మొత్తానికి లోకేష్ చెప్పిందేదీ చేయడని తెలుసుకున్న తవుు్మళ్లంతా.. ‘అంతా తండ్రి పోలికే..’ అని అనుకుంటున్నార్ట!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement