11 నుంచి జగన్ ఎన్నికల ప్రచారం | Tour Schedule of YS Jagan, YS Vijayamma and ys Sharmila | Sakshi
Sakshi News home page

11 నుంచి జగన్ ఎన్నికల ప్రచారం

Apr 8 2014 8:27 AM | Updated on Jul 25 2018 4:09 PM

11 నుంచి జగన్  ఎన్నికల ప్రచారం - Sakshi

11 నుంచి జగన్ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్: లోక్‌సభ, శాసనసభ ఎన్నికల ప్రచారం కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11వ తేదీ నుంచి వైఎస్‌ఆర్ జనభేరి ప్రారంభించనున్నారు.

16 వరకు కర్నూలు, అనంతపురం,
కడప జిల్లాల్లో పర్యటన

10 నుంచి విజయమ్మ, షర్మిల ప్రచారం

 హైదరాబాద్: లోక్‌సభ, శాసనసభ ఎన్నికల  ప్రచారం కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11వ తేదీ నుంచి వైఎస్‌ఆర్ జనభేరి ప్రారంభించనున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ సోదరి షర్మిల కూడా ఈ నెల 10 నుంచి జనభేరి ప్రచార సభల్లో పాల్గొంటారని పార్టీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురామ్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

 కర్నూలు నుంచి జగన్: జగన్ 11, 12 తేదీల్లో కర్నూలు, 13, 14 తేదీల్లో అనంతపురం, 15, 16 తేదీల్లో కడప జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తారు. పలుచోట్ల బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. గుంటూరు నుంచి విజయమ్మ: విజయమ్మ ఈ నెల 10న గుంటూరు జిల్లాలో తన పర్యటన ప్రారంభిస్తారు. 10, 11, 12 తేదీల్లో గుంటూరు, 13, 14 తేదీల్లో కృష్ణా, 15, 16 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆమె ప్రచారం నిర్వహిస్తారు.

 తెలంగాణలో షర్మిల: షర్మిల సికింద్రాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెడతారు. 10 నుంచి 16వ తేదీ వరకు మల్కాజిగిరి, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. పార్టీ ప్రధాన ప్రచారకర్తలైన వీరి రోజువారీ పర్యటన వివరాలను తర్వాత ప్రకటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement