చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?

చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? - Sakshi


తాను అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను ఒంటి చేత్తో కాపాడతానని బీరాలు పలికిన చంద్రబాబు సొంత పార్టీ నాయకులను నియంత్రించడంలో విఫలమయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడి 24 గంటలు గడవకముందే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులపై తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడ్డారు. ఎంపీగా నెగ్గిన టీడీపీ నాయకుడే స్వయంగా దాడులకు దిగినా పచ్చ పార్టీ అధినేత మిన్నకుండిపోయారు. కనీసం దాడులను ఖండించిన పాపాన పోలేదు.



సొంతూరులో తనకు ఆధిక్యం దక్కలేదన్న అక్కసుతో కాకినాడ ఎంపీగా ఎన్నికైన టీడీపీ నేత తోట నరసింహం తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడి మండలం వీరవరంలో వైఎస్సార్ సీపీ నాయకులను దుర్భాషలాడుతూ, దాడులు చేశారు. కాకినాడలో టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరులు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై గూండాల్లా దాడులకు తెగపడ్డారు. ‘వైఎస్సార్‌సీపీకి పనిచేస్తారా.. మీ అంతు చూస్తాం’ అంటూ పెద్దాపురం మండలం దివిలి ఎస్సీ పేటలో ఇళ్లల్లోకి చొరబడి తెలుగు తమ్ముళ్లు వీరంగమాడారు.



ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం గాజులపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఇళ్లల్లో ఉన్నవారిని బయటకు లాక్కొచ్చి మరీ చితక బాదారు. మమ్ము రమణ అనే నిండు గర్భిణిని పొట్టపై విచక్షణారహితంగా తన్నడంతో ఆమె ప్రమాదకర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గుంటూరు జిల్లా భావపురిలో టీడీపీ కార్యకర్తలు కత్తులు చేతబట్టి కారులో స్వైరవిహారం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు తమ్ముళ్ల ఘాతుకాలకు అంతే లేదు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు నుంచి కనీస స్పందన కరువయింది. సొంత పార్టీవారే దాడులకు తెగబడుతున్నా టీడీపీ అధినేతలో చలనం శూన్యం. శాంతి భద్రతలను కాపాడడమంటే ఇదేనా అని నిలదీస్తున్న బాధితులకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top