జలాసురుడు.. | Sakshi
Sakshi News home page

జలాసురుడు..

Published Fri, Apr 25 2014 1:16 AM

జలాసురుడు.. - Sakshi

బాబు హయాంలో రియల్ దాష్టీకం
హైదరాబాద్‌లో 104 చెరువులు మాయం

 
 చిన్న తటాకాన్ని తలపిస్తుంది.. 200 ఎకరాల విస్తీర్ణం నుంచి 80 ఎకరాలకు కుదించుకుపోయింది. ఇదొక్కటే కాదు.. 1995 నుంచి 2004 మధ్యకాలంలో యథేచ్ఛ ఆక్రమణలతో చెరువులన్నీ సహజ స్వరూపాన్ని కోల్పోగా దాదాపు 104 చెరువులు పూర్తిగా మాయమైపోయాయి.. హెచ్‌ఎండీఏ అధికారి సర్వేలో వెల్లడైన వాస్తవాలివి. చంద్రబాబు జమానాలో హైదరాబాద్‌లో నిరాటంకంగా సాగిన జలవనరుల విధ్వంసాలకు శిథిలసాక్ష్యాలు. భాగ్యనగరం, దానిచుట్టుపక్కల ఒకప్పుడు 500లకు పైగా చిన్నా పెద్ద చెరువులు, కుంటలు ఉండేవి. ఎంతపెద్ద వర్షం కురిసినా గొలుసుకట్టుగా ఒక చెరువు నిండగానే మరో చెరువులోకి నీళ్లు వచ్చేవి. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో విచ్చలవిడిగా జరిగిన ఆక్రమణల వల్ల ఇవన్నీ కుచించుకుపోయాయి. 2004 సంవత్సరం నాటికి 10 హెక్టార్ల పైన విస్తీర్ణం కలిగిన చెరువులు కేవలం 169 మాత్రమే మిగిలి ఉన్నట్లు హెచ్‌ఎండీఏ సర్వేలో తేలింది.  

111 జీవోకు తూట్లు: బాబు అండదండలతో కొందరు రాజకీయ ప్రముఖులు జలాశయాల శిఖాన్నే ఆక్రమించి రిసార్ట్స్, ఫాంహౌస్‌లు, విద్యాసంస్థలను నిర్మించుకొన్నారు. 111జీవోలో ఎలాంటి నిర్మాణాలకు అవకాశం లేకపోయినా అది ఈ బడా వ్యక్తులను అడ్డుకోలేక పోయిం ది. దుర్గం చెరువును టూరిజం స్పాట్‌గా మారుస్తున్నట్లు ప్రకటనలు చేసి న బాబు చెరువులు ఆక్రమణలకు గురికాకుండా బఫర్‌జోన్‌ను అమలు చేయలేకపోయారు. దుర్గం చెరువు వద్ద నిర్మాణాలకు అనుమతులిచ్చేటప్పుడు ఎఫ్‌టీఎల్‌ను కూడా ఖాతరు చేయలేదు. ఇక్కడ బహుళ అంత స్తు భవనాలు నిర్మించినవారంతా బాబు పరివారంలోని ప్రముఖులే.

 ‘రియల్’దాష్టీకం: సుమారు 240 చ.కి.మీ పరిధిలోని హుస్సేన్‌సాగర్ పరివాహక ప్రాంతంలో మొత్తం 80 చెరువులున్నాయి. వర్షాకాలంలో కూకట్‌పల్లి, యూసఫ్‌గూడ, కుత్బుల్లాపూర్, బోయిన్‌పల్లి, బాలానగర్, జీడిమెట్ల, అల్వాల్ తదితర ప్రాంతాల్లోని చెరువులు నిండి ఆ నీరు నాలాల ద్వారా హుస్సేన్‌సాగర్‌లో కలుస్తాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు వాణిజ్య భవనాలు, విద్యాసంస్థలు, అపార్టుమెంట్లు వెలిశాయి. కూకట్‌పల్లి ప్రగతినగర్ చెరువు, ఎల్లమ్మ చెరువు, కుత్బుల్లాపూర్ కుంట, పంతులు చెరువు, రంగధాముని చెరువులు చాలావరకు కబ్జాలకు గురయ్యాయి. శేరిలింగపల్లి మండల పరిధిలోని గంగారం పెద్దచెరువు, మదీనాగూడ చెరువు, చందానగర్ వద్ద బచ్చుకుంట, మల్లయ్య కుంట, మియాపూర్ పటేల్‌చెరువు, గోపన్‌పల్లి వద్ద నల్లకుంటలదీ అదే దుస్థితి. బాలానగర్ మండలం పరిధిలో 16 చెరువులున్నట్లు రికార్టులు సూచిస్తున్నాయి. అయితే సున్నం చెరువు, కాజాకుంట, ఈదుల కుంట, ఈదుల కుంట, భీముని కుంట,అలీ తలాబ్‌చెరువు, నల్లచెరువులు ఆక్రమణలతో కుచించుకుపోయాయి. సరూర్‌నగర్ చెరువు, కర్మన్‌ఘాట్‌లోని చేపల చెరువు, రామంతపూర్ చెరువు, ఉప్పల్ నల్ల చెరువులూ ఆక్రమణదారుల పాలయ్యాయి. రియల్టర్లు, డెవలపర్స్ నుంచి అప్పట్లో  పార్టీ ఫండ్ రూపంలో పెద్దమొత్తంలో ముడుపులు అందడంతో ఆక్రమణదారులపై బాబు వల్లమాలిన ప్రేమను ఒలకబోశారు. ఫలితంగా చెరువులు మాయమైపోయాయి
 

Advertisement
Advertisement