సీమాంధ్రలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల నియమావళి ప్రకారం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం బంద్ చేశారు.
హైదరాబాద్: సీమాంధ్రలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల నియమావళి ప్రకారం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం బంద్ చేశారు. బుధవారం 11 జిల్లాల్లో 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 3.67 కోట్ల మందికిపైగా ఓటర్లున్నారు.
సీమాంధ్రలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్యే పోటీ నెలకొంది. కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీలు బరిలో ఉన్నా నామమాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల విస్తృతంగా పర్యటించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతీ రెడ్డి ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గతంలో పలు సర్వేలు వెల్లడించాయి.