జీతాలెలా ఇస్తావో చెప్పు బాబూ! | job for family Offered Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

జీతాలెలా ఇస్తావో చెప్పు బాబూ!

Apr 23 2014 12:19 AM | Updated on May 29 2018 4:06 PM

జీతాలెలా ఇస్తావో చెప్పు బాబూ! - Sakshi

జీతాలెలా ఇస్తావో చెప్పు బాబూ!

రాష్ట్రంలో కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తానని బూటకపు ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు.. వారికి జీతాలెలా ఇస్తారో చెప్పాలని మాజీ మంత్రి, రామచంద్రపురం వైఎ స్సార్ సీపీ అభ్యర్థి

 కె.గంగవరం, న్యూస్‌లైన్ :రాష్ట్రంలో కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తానని బూటకపు ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు.. వారికి జీతాలెలా ఇస్తారో చెప్పాలని మాజీ మంత్రి, రామచంద్రపురం వైఎ స్సార్ సీపీ అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్ర బోస్ డిమాండ్ చేశారు. కోలంక నుంచి కె.గంగవరం మండలం యండగండి వరకు సాగిన పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ  నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. కె.గంగవరం సభలో బోస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 3.70 కోట్ల ఇళ్లు ఉన్నాయన్న సంగతి బాబుకు తెలియదన్నారు. సాధ్యం కాని ప్రకటనలను నమ్మేందుకు ప్రజలు అమాయకులు కారన్నా రు. రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని, అలా చంద్రబాబు స్పష్టం చేయగలరా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ మేని ఫెస్టోలో ప్రకటించిన పథకాలన్నీ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన మరుక్షణం అమల్లోకి వస్తాయన్నారు. ఇంటికో ఉద్యోగం, రైతుల రుణాల మాఫీని చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు చేయలేదని నిలదీశారు.
 
 వైఎస్ కుటుంబంపై కుట్రలు : విశ్వరూప్
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర చేపడితే, కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేశాయని మాజీ మంత్రి, అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ అన్నారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు చీకటిపాలనను ప్రజలు మరలా కోరుకోవడం లేదన్నారు. మండపేట అసెంబ్లీ అభ్యర్థి గిరిజాల వెంకటస్వామినాయుడు, సీఈసీ సభ్యుడు రెడ్డి ప్రసాద్, నాయకులు కర్రి పాపారాయుడు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, యనమదల గీత, వి.సూర్యచంద్ర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement