ఎగ్జిట్‌పోల్ సర్వేలపై ఈసీ నిషేధం | EC bans exit polls between April 7 and May 12 | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్‌పోల్ సర్వేలపై ఈసీ నిషేధం

Apr 5 2014 1:49 AM | Updated on Aug 29 2018 8:54 PM

ఎగ్జిట్‌పోల్ సర్వేలపై ఈసీ నిషేధం - Sakshi

ఎగ్జిట్‌పోల్ సర్వేలపై ఈసీ నిషేధం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. తొలి దశ పోలింగ్ ప్రారంభమయ్యే ఏప్రిల్ 7 నుంచి చివరి దశ ఎన్నికల పోలింగ్ ముగిసే మే 12 వరకూ ఈ నిషేధం అమలులో ఉండనుంది.

 ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకూ అమలు
 న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. తొలి దశ పోలింగ్ ప్రారంభమయ్యే ఏప్రిల్ 7 నుంచి చివరి దశ ఎన్నికల పోలింగ్ ముగిసే మే 12 వరకూ ఈ నిషేధం అమలులో ఉండనుంది.
 
 ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మే 12వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకూ ఎగ్జిట్‌పోల్స్‌ను ఏ పద్ధతిలోనైనా ముద్రించడంగానీ, ప్రసారంగానీ, ప్రచారంగానీ నిషేధిస్తున్నట్టు స్పష్టంచేసింది. ఈ నిషేధం అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లకూ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 48 గంటల ముందు నుంచి ఒపీనియన్ పోల్ సర్వేల ఫలితాలు ప్రకటించడంపైనా ఈసీ నిషేధం విధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement