మాజీ సీఎంతో ఇలాగేనా...! | Magi cmtho ilagena | Sakshi
Sakshi News home page

మాజీ సీఎంతో ఇలాగేనా...!

Oct 25 2015 4:14 AM | Updated on Jul 29 2019 5:31 PM

మాజీ సీఎంతో ఇలాగేనా...! - Sakshi

మాజీ సీఎంతో ఇలాగేనా...!

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఆ దర్పం, దర్జా అన్నీ అనుభవించిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని శంకుస్థాపన సందర్భంగా చోటు

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఆ దర్పం, దర్జా అన్నీ అనుభవించిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని శంకుస్థాపన సందర్భంగా చోటు చేసుకున్న సంఘటన పూర్తిగా చిన్నబుచ్చుకునేలా చేసిందట. శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్‌లు మాజీ ముఖ్యమంత్రిని సమయం ఇవ్వాలని కోరారు. చెప్పిన సమయానికి తీరా మంత్రులు కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్సీ ఒకరు, ఆయనతో మరో ఇద్దరు చోటా టీడీపీ నేతలు ఆహ్వానపత్రం తీసుకెళ్లడంతో కిరణ్‌కుమార్‌రెడ్డికి కోపం వచ్చిందట.

దాంతో ఆహ్వాన పత్రం అందజేసే సమయంలో ఫొటోలు తీయడంతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కోసం కొంతమంది మీడియా ప్రతినిధులను వెంట తీసుకెళ్లిన టీడీపీ నేతలపై రుసరుసలాడారు. మంత్రులు వస్తున్నారు కదా అని ఆహ్వానపత్రం తీసుకోవడానికి సరేనని అన్నాననీ, చోటామోటా లీడర్లతో ఫొటోలు దిగాలా...! అని చిన్నబుచ్చుకున్న ఆ మాజీ సీఎంగారు ఆహ్వానపత్రం అందజేసే సమయంలో ఫొటోగ్రాఫర్లు, వీడియో కెమెరామెన్‌లను లోపలికి అనుమతించలేదట. అధికారం లేకపోతే అంతే మరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement