అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపించాలి | YSRCP requested to DM about busses | Sakshi
Sakshi News home page

అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపించాలి

Nov 25 2016 3:16 AM | Updated on May 29 2018 4:26 PM

అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపించాలి - Sakshi

అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపించాలి

వివిధ ప్రాంతాలకు బస్సుసౌకర్యం కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు

ఆర్‌ఎంకు వైఎస్సార్సీపీ వినతి
మంకమ్మతోట :   వివిధ ప్రాంతాలకు బస్సుసౌకర్యం కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ గురువారం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. నగరంలో నడుస్తున్న రెండు కొత్త సిటీ బస్సులను కరీంనగర్ నుంచి సుల్తానాబాద్‌కు వయా బొమ్మకల్‌స్టేజీ మీదుగా నడిపించాలని కోరారు. రైల్వేస్టేషన్, తీగలగుట్టపల్లి, ప్రతిమ మెడికల్ కళాశాల, చామన్‌పల్లి, చెర్లబూత్కూర్, మొగ్దుంపూర్, దుర్శేడ్, ఆనందరావు మెడికల్ కళాశాల, బొమ్మకల్ స్టేజీ మీదుగా కరీంనగర్‌కు నడిపించాలని విన్నవించారు. వేములవాడకు మాదిరిగానే ధర్మపురి దేవస్థానానికి కరీంనగర్ నుంచి డెరైక్ట్ బస్సులు వేయాలని కోరారు.

కరీంనగర్ నుంచి ధర్మారం వరకు నాన్‌స్టాప్ బస్సులు, చొప్పదండి వరకు నడుస్తున్న సిటీ బస్సులను ధర్మారం వరకు పొడిగించాలని, లక్షెట్టిపేట  మీదుగా మంచిర్యాలకు నడుస్తున్న కాలం చెల్లిన బస్సులను తొలగించి వాటి స్థానంలో కండిషన్ బస్సులను నడిపించాలని కోరారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పారుపెల్లి వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వినుకొండ రామకృష్ణారెడ్డి, యూత్‌స్టేట్ జనరల్ సెక్రటరీ దుబ్బాక సంపత్, జిల్లా నాయకులు సాన రాజయ్య, వరాల అనిల్, అహ్మద్ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement