
'చంద్రబాబు తేనెపూసిన కత్తి'
చంద్రబాబు తేనెపూసిన కత్తి అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.
వైఎస్‌ఆర్ జిల్లా: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. మంగళవారం వైఎస్‌ఆర్ జిల్లాలో పాత్రికేయులతో మాట్లాడిన ఆమె.. ప్రత్యేక హోదా కోసం పార్టీలకతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు తేనెపూసిన కత్తి అని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆయన కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. కేంద్రంలో జీరో అవుతాననే భయం ముఖ్యమంత్రికి పట్టుకుందని అన్నారు.