పవన్ కల్యాణ్ వల్లే టీడీపీ గెలిచింది: రోజా | YSRCP MLA Roja takes on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ వల్లే టీడీపీ గెలిచింది: రోజా

Jul 22 2014 11:39 AM | Updated on Jun 2 2018 5:56 PM

పవన్ కల్యాణ్ వల్లే టీడీపీ గెలిచింది: రోజా - Sakshi

పవన్ కల్యాణ్ వల్లే టీడీపీ గెలిచింది: రోజా

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కారణంగానే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా స్సష్టం చేశారు.

చిత్తూరు: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కారణంగానే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా స్సష్టం చేశారు. మంగళవారం చిత్తూరులో రోజా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రైతుల రుణమాఫీపై చంద్రబాబు ప్రకటనలో స్ఫష్టత లేదని తెలిపారు. రుణమాఫీల కోసం రైతులను మభ్యపెట్టడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రుణమాపీపై కమిటీలు వేశామంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. మేనిఫెస్టో ప్రకటించినప్పుడు రుణమాఫీకి ఎన్ని కోట్లు అవసరమవుతాయో చంద్రబాబుకు తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement