వైఎస్‌ఆర్‌సీపీ బైక్‌ ర్యాలీ | ysrcp bike rally for special status | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ బైక్‌ ర్యాలీ

Sep 9 2016 10:28 PM | Updated on Sep 4 2017 12:49 PM

వైఎస్‌ఆర్‌సీపీ బైక్‌ ర్యాలీ

వైఎస్‌ఆర్‌సీపీ బైక్‌ ర్యాలీ

ప్రత్యేక హోదా కోసం శనివారం నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య పిలుపునిచ్చారు.

కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదా కోసం శనివారం నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కృష్ణకాంత్‌ ప్లాజాలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఊపి భారీ బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ నంద్యాల చెక్‌పోస్టు, రాజ్‌విహార్, పాతబస్తీ, ఆర్టీసీ బస్టాండుల మీదుగా జాతీయ రహదారి వరకు కొనసాగింది. పార్టీ జిల్లా నాయకులు నాగరాజు యాదవ్, అనిల్‌కుమార్, రఘు, డి.కె.రాజశేఖర్, పర్ల శ్రీధర్‌రెడ్డి, అల్లీపీరా, కల్లూరు అర్బన్‌ ఇన్‌చార్జి బి. మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement