
పదిలం నీ జ్ఞాపకం..
వాడవాడనా వైఎస్ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు ఆయన అభిమానులు వైఎస్సార్ విగ్రహాలకు
జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్ జయంతి
వాడవాడనా వైఎస్ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు ఆయన అభిమానులు వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు. పలుచోట్ల యువకులు రక్తదానాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం పలు చోట్ల వైఎస్‌కు నివాళి అర్పించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలను శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కేక్‌లు కట్‌చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు నోట్‌పుస్తకాలు.. వాటర్‌బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ హయాంలో చేసిన సేవలను, పేదప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన విధానాన్ని స్మరించుకున్నారు.