విశాఖ చేరుకున్న వైఎస్ జగన్ | ys jagan mohan reddy reached visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ చేరుకున్న వైఎస్ జగన్

May 4 2016 1:03 PM | Updated on Jul 25 2018 4:09 PM

విశాఖ చేరుకున్న వైఎస్ జగన్ - Sakshi

విశాఖ చేరుకున్న వైఎస్ జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖ చేరుకున్నారు. బ్రాండెక్స్ కార్మికుల చేపట్టిన ఉద్యమంలో పాల్గొని ఆయన సంఘీభావం తెలపనున్నారు.

విశాఖ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం  విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కనీస వేతనాల పెంపు, పీఎఫ్ అమలు డిమాండ్‌తో గత నెల 16 నుంచి బ్రాండెక్స్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్ బ్రాండెక్స్ కార్మికుల చేపట్టిన ఉద్యమంలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. ఇక హైదరాబాద్ నుంచి విమానంలో మధురవాడ విమానాశ్రయం చేరుకున్న ఆయన నేరుగా మిందిలోని పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఇంటికి వెళ్లారు.

అక్కడ భోజనం అనంతరం బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు అచ్యుతాపురం చేరుకుంటారు. తొలుత బ్రాండెక్స్ కార్మికులతో ఏర్పాటు చేసిన ముఖాముఖీలో పాల్గొంటారు. వారి కష్టసుఖాలు, సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం కార్మికులనుద్దేశించి మాట్లాడతారు. అక్కడ నుంచి నేరుగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుని సాయంత్రం 5.30 గంటలకు విమానంలో తిరిగి హైదరబాద్ పయనమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement