భార్య, ప్రియుడే హంతకులు | wife and lover accuses | Sakshi
Sakshi News home page

భార్య, ప్రియుడే హంతకులు

Aug 20 2016 12:34 AM | Updated on Oct 4 2018 8:38 PM

వివాహేతర సంబంధానికి అడ్డుతగులుతున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో ఇక్కడి సుబ్రహ్మణ్యపుర పోలీసులు శుక్రవారం ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

బొమ్మనహళ్లి (బెంగళూరు) : వివాహేతర సంబంధానికి అడ్డుతగులుతున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో ఇక్కడి సుబ్రహ్మణ్యపుర పోలీసులు శుక్రవారం ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. నిందితురాలు మంజులాబాయి, ఆంజనేయులు నాయక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు. వివరాల మేరకు... ఏజీఎస్‌ లేఔట్‌లో నివాసముంటున్న యుగేంద్రనాయక్‌ భార్య మంజులతో కలిసి ఉంటున్నాడు. ఇదిలా ఉంటే అక్కడ నివాసముంటున్న అనంతపురం జిల్లా పెడపల్లి తండాకు చెందిన ఆంజనేయులుతో మంజులకు వివాహేతర సంబంధం ఏర్పడింది.


ఎలాగైన భర్తను వదిలించు కోవాలనుకున్న మంజుల ఈనెల 11న రాత్రి ప్రియుడు ఆంజనేయులు నాయక్‌ను ఇంటికి పిలిపించుకుని నిద్రపోతున్న యుగేంద్రపై కర్రలతో దాడిచేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి అదే రోజు ఇట్టమడుగు రోడ్డులో ఉన్న రాజకాలువ పొదల్లో పడేశారు. ఇదే సమయంలో తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి ఎత్తుకెళ్లినట్లు రోదిస్తూ సుబ్రహ్మణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంజులను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెల్లడించింది. దీంతో ఆంజనేయులును కూడా అరెస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement