వరంగల్‌ రైల్వే స్టేషన్‌కు మరో 16 సీసీ కెమెరాలు | Warangal railway station and 16 cc cameras | Sakshi
Sakshi News home page

వరంగల్‌ రైల్వే స్టేషన్‌కు మరో 16 సీసీ కెమెరాలు

Aug 25 2016 12:16 AM | Updated on Aug 14 2018 3:37 PM

వరంగల్‌ రైల్వేస్టేన్‌లో ప్రయాణికుల భద్రత, నేరస్తుల గుర్తింపునకు ఇప్పుడున్న 8 సీసీ కెమెరాలతోపాటు మరో 16 సీసీ కెమెరాలు మంజూరైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. స్టేషన్‌లోని మూడు ప్లాట్‌ఫామ్‌ల్లో ప్రస్తుతం ఉన్న సీసీ కెమరాలు కొంతమేరకే నిఘాలో ఉన్నా మిగతా ఏరియాలో జరగుతున్న విషయాలను తెలుసుకోలేని పరిస్థితి ఉంది.

మహబూబాబాద్‌కు 15..
రైల్వేగేట్‌ : వరంగల్‌ రైల్వేస్టేన్‌లో ప్రయాణికుల భద్రత, నేరస్తుల గుర్తింపునకు ఇప్పుడున్న 8 సీసీ కెమెరాలతోపాటు మరో 16 సీసీ కెమెరాలు మంజూరైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. స్టేషన్‌లోని మూడు ప్లాట్‌ఫామ్‌ల్లో ప్రస్తుతం ఉన్న సీసీ కెమరాలు కొంతమేరకే నిఘాలో ఉన్నా మిగతా ఏరియాలో జరగుతున్న విషయాలను తెలుసుకోలేని పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వం ప్రయాణికుల భద్రత, దొంగలు, అసాంఘిక శక్తుల కదలికలు తెలుసుకునేందుకు మరో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే మహబూబాద్‌ రైల్వేస్టేçÙన్‌లో కూడా 15 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. నిత్యం వరంగల్‌ రైల్వేస్టన్‌కు 100కుపైగా రైళ్లు 25వేలకుపైగా ప్రయాణికుల రాకపోకలుండగా, మహబూబాద్‌లో 52 రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయని, వేలాది మంది ప్రయాణికులు వచ్చి వెళ్తుంటారని రైల్వే సిబ్బంది తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లాగా మారనుండడంతో ప్రయాణికుల భద్రతకు కృషి జరుగుతోంది. ఈ సీసీ కెమెరాలను డిసెంబర్‌కల్లా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement