రాజ్యసభ సభ్యునిగా విజయసాయిరెడ్డి ప్రమాణం | Vijaya Sai Reddy takes oath as rajya sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభ సభ్యునిగా విజయసాయిరెడ్డి ప్రమాణం

Jun 28 2016 5:37 PM | Updated on May 29 2018 2:42 PM

రాజ్యసభ సభ్యునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.

న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాజసభ్య చైర్మన్, భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు కూడా సభ్యునిగా ప్రమాణం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైన డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇటీవల రాజసభ్యకు ద్వైవార్షిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వి విజయసాయిరెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రంలో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ తరపున కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఎన్నికైన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement