చిన్నారుల ప్రాణం తీసిన ఈత సరదా | two kids died while went for swimming | Sakshi
Sakshi News home page

చిన్నారుల ప్రాణం తీసిన ఈత సరదా

Oct 2 2016 5:59 PM | Updated on Aug 25 2018 5:41 PM

ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి గల్లంతయ్యారు.

ములుగు(వరంగల్): ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ములుగు మండలం మదనపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఈత కొట్టడానికి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఈక్రమంలో నీట మునిగి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, గజ ఈతగాళ్ల సాయంతో చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement