క్యాలెండర్‌ ఆవిష్కరణ | TUTF Calendar innovation | Sakshi
Sakshi News home page

క్యాలెండర్‌ ఆవిష్కరణ

Jan 2 2017 10:50 PM | Updated on Sep 5 2017 12:12 AM

క్యాలెండర్‌ ఆవిష్కరణ

క్యాలెండర్‌ ఆవిష్కరణ

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో ఆదివారం టీయూటీఎఫ్‌ 2017 క్యాలెండర్‌ను రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు.

నిర్మల్‌ టౌన్ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో ఆదివారం టీయూటీఎఫ్‌ 2017 క్యాలెండర్‌ను రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో టీయూటీఎఫ్‌ కీలకపాత్ర పోషించిందన్నారు. ఇందులో కలెక్టర్‌ ఇలంబరిది, జేసీ శివలింగయ్య, మున్సిపల్‌ చైర్మన్ అప్పాల గణేశ్‌ చక్రవర్తి, మార్కెట్‌ కమిటీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, టీయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మురళీమనోహర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నాగభూషణ్, రవికాంత్, లక్షీ్మప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్‌ టౌన్ : పీఆర్‌టీయూ సంఘం రూపొందించిన 2017 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆదివారం రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను కేసీఆర్‌ ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు.  ఇందులో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారావు, జి.జనార్దన్, నాయకులు పాల్గొన్నారు.

నిర్మల్‌ రూరల్‌ : తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్‌ యూనియన్ (టీఎంఈయూ) నూతన సంవత్సర క్యాలెండర్‌ను రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. జిల్లాకేంద్రంలోని తన స్వగృహంలో ఆదివారం యూనియన్ నాయకులతో కలిసి ఆయన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా హిదాయత్‌అలీ, ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ అథరుద్దీన్, కోశాధికారి మొయిజుద్దీన్, నాయకులు ఇర్ఫాన్, మతీన్, షరీఫ్, నహిద్‌పాషా, గౌసోద్దీన్, అన్సర్, ఫిరోజ్, ఫరీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement