రేగులపల్లిలో చిరుత కలకలం | tiger Insisted in regulapally | Sakshi
Sakshi News home page

రేగులపల్లిలో చిరుత కలకలం

Aug 4 2016 11:05 PM | Updated on Sep 4 2017 7:50 AM

మండలంలోని రేగులపల్లిలో చిరుత కలకలం సృష్టిస్తోంది. పదిహేను రోజులుగా వ్యవ«ధిలో మూడు గొర్రెల చిరుత అపహరించుకుపోయింది. గ్రామంలోకి చిరుత వస్తున్నా ఫారెస్ట్‌ అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బెజ్జంకి : మండలంలోని రేగులపల్లిలో చిరుత కలకలం సృష్టిస్తోంది. పదిహేను రోజులుగా వ్యవ«ధిలో మూడు గొర్రెల చిరుత అపహరించుకుపోయింది. గ్రామంలోకి చిరుత వస్తున్నా ఫారెస్ట్‌ అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేగులపల్లి గుట్టకు గొర్రెలను మేత కోసం కాపారులు తీసుకువెళ్తారు. అక్కడే నివాసాలు ఏర్పాటుచేసిన కంచెలో గొర్రెల మందను ఉంచుతారు. రాత్రి సమయాల్లో చిరుత మందపై దాడి చేస్తూ గొర్రెలను ఎత్తుకుపోతోంది. పదిహేను రోజులుగా చిరుత సంచారం ఎక్కువగా కావడంతో స్థానికులు ఆందోళనకు గురువుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement