సంస్కరణల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రజలంతా కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారామ్ అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమ అమరవీరుల వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయం వచ్చింది
Aug 29 2016 12:44 AM | Updated on Oct 2 2018 6:46 PM
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారామ్
ఏలూరు (సెంట్రల్) : సంస్కరణల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రజలంతా కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారామ్ అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమ అమరవీరుల వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ ఉద్యమం ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించిందని, ఆనాటి ఉద్యమంలో ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదన్నారు
Advertisement
Advertisement