రైతుల పట్ల టీర్‌ఎస్ ప్రభుత్వ నిరంకుశ ధోరణి వీడాలని బెల్లంంపల్లి మండల జెడ్పీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సిద్దం తిరుపతి హెచ్చరించారు.
రైతుల విషయంలో నిరంకుశ ధోరణి వీడాలి
Jul 25 2016 11:32 PM | Updated on Mar 18 2019 7:55 PM
కాసిపేట : రైతుల పట్ల టీర్‌ఎస్ ప్రభుత్వ నిరంకుశ ధోరణి వీడాలని బెల్లంంపల్లి మండల జెడ్పీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సిద్దం తిరుపతి హెచ్చరించారు. సోమవారం రాష్ట్రీయ రహదారిపై సోమగూడెం చౌరస్తాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసిత రైతులపై లాఠీచార్జీ, కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతులపై పోలీసుల చర్యలు హేయమైన చర్యగా అభివర్ణించారు. తెలంగాణప్రభుత్వం రైతులకు అన్ని ప్రాంతాల్లో నష్టం చేస్తుందన్నారు. ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులు ఉండవని చెప్పిన ముఖ్యమంత్రి నేడు గ్రామాలను బొందల గడ్డగా మారుస్తున్నరన్నారు. పాణహిత ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాకు ఉపయోగపడకుండా చేసి కాళేశ్వరంలో చేపట్టడం, మల్లన్న సాగర్ నిర్వాసితులకు అన్యాయం చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేముల కష్ణ, గొంది వెంకటరమణ, భరతాని సతీష్, కొండబత్తుల రాంచందర్, మహేష్, గాదం గట్టయ్య తదితరులున్నారు.
Advertisement
Advertisement