పార్టీని బూత్‌ స్థాయి నుంచి పటిష్ట పరచాలి | Strengthen the party from booth level | Sakshi
Sakshi News home page

పార్టీని బూత్‌ స్థాయి నుంచి పటిష్ట పరచాలి

Aug 7 2017 11:00 PM | Updated on Mar 29 2019 9:31 PM

పార్టీని బూత్‌ స్థాయి నుంచి పటిష్ట పరచాలి - Sakshi

పార్టీని బూత్‌ స్థాయి నుంచి పటిష్ట పరచాలి

బీజేపీని మేడ్చల్‌ నియోజకవర్గంలో బూత్‌ స్థాయి నుంచే పటిష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర నేలు సురేశ్‌ అన్నారు.

మేడ్చల్‌: బీజేపీని మేడ్చల్‌ నియోజకవర్గంలో బూత్‌ స్థాయి నుంచే పటిష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర నేలు సురేశ్‌ అన్నారు. ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇంటింటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరేలా కార్యకర్తలు, బూత్‌ ఇన్‌చార్జ్‌లు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్‌ మోహన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గౌరారం జగన్‌గౌడ్, నాయకులు శ్రీనివాస్, మల్లారెడ్డి, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

కీసర:
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కిసాన్‌ మోర్చ ఉపాధ్యక్షులు సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం నాగారం గ్రామంలో మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. 2019లో రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చే విధంగా ఇప్పటి నుంచే కార్యకర్తలు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement