ఆర్వీఎం నూతన భవనం ప్రారంభం | Start new building | Sakshi
Sakshi News home page

ఆర్వీఎం నూతన భవనం ప్రారంభం

Oct 25 2016 3:23 AM | Updated on Sep 4 2017 6:11 PM

ఆర్వీఎం నూతన భవనం ప్రారంభం

ఆర్వీఎం నూతన భవనం ప్రారంభం

మండలంలోని హస్నాపూర్ గ్రామపంచాయతీ పరిధి శ్యాంనాయక్‌తండాలో రూ.6.50 లక్షల వ్యయంతో నిర్మించిన

 ఉట్నూర్ రూరల్ : మండలంలోని హస్నాపూర్ గ్రామపంచాయతీ పరిధి శ్యాంనాయక్‌తండాలో రూ.6.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్వీఎం నూతన భవనాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం శంకర్‌నాయక్‌తండలోని మావోలి, హస్నాపూర్‌లోని బాలాజీ మందిరాల అభివృద్ధికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విమల, ఉప సర్పంచ్ రౌఫ్, ఎంపీపీ రాథోడ్ విమల, జెడ్పీటీసీ సభ్యుడు జగ్జీవన్, ఎంపీటీసీ సభ్యురాలు శారద, కోఆప్షన్ సభ్యుడు ముజీబ్, టీఆర్‌ఎస్ నాయకులు లక్కాకుల భూపతి, అజీం, లింగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement