4న వైఎస్సార్‌ ఇంజినీరింగ్‌ కాలేజిలో స్పాట్‌ అడ్మిషన్లు | spot admission in ysr engineering college on4th | Sakshi
Sakshi News home page

4న వైఎస్సార్‌ ఇంజినీరింగ్‌ కాలేజిలో స్పాట్‌ అడ్మిషన్లు

Jul 30 2016 11:06 PM | Updated on Sep 4 2017 7:04 AM

స్థానిక వైఎస్సార్‌ ఇంజినీరింగ్‌కాలేజి ఆఫ్‌ యోగివేమన యూనివర్సిటీలో లేటరల్‌ఎంట్రి (ఈసెట్‌) సీట్లకు ఈనెల 4న ఉదయం 9 గంటలకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ బి.జయరామిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రొద్దుటూరు:
స్థానిక వైఎస్సార్‌ ఇంజినీరింగ్‌కాలేజి ఆఫ్‌ యోగివేమన యూనివర్సిటీలో లేటరల్‌ఎంట్రి (ఈసెట్‌) సీట్లకు ఈనెల 4న ఉదయం 9 గంటలకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ బి.జయరామిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్, మెకానికల్‌ ఇంజినీరింగ్, మెటరర్జీ అండ్‌ మెటీరియల్‌ టెక్నాలజీలో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అడ్మిషన్లకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజనల్‌ సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. స్పాట్‌ అడ్మిషన్‌లో సీటు పొందిన విద్యార్థులు వెంటనే రూ.10వేలు ట్యూషన్‌ ఫీజు, రూ.5,500 స్పెషల్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్పాట్‌ అడ్మిషన్‌లో సీటు పొందిన అభ్యర్థులు ఫీజు రీయింబర్స్‌మెంటుకు అర్హులు కారని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement