సివిల్ సప్లయ్ అధికారుల చేతివాటం!
రేషన్ డిపోల్లో తూనిక యంత్రాలకు సీళ్లు వేసే ప్రక్రియలో సివిల్ సప్లయ్ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని పలువురు డీలర్లు ఆరోపిస్తున్నారు. సీళ్లు వేసే ప్రక్రియలో భాగంగా ఆమదాలవలసలోని కుసుమంచివారివీధిలో గోదాము వద్దకు రావాలంటూ ఆదివారం సివిల్ సప్లయ్ అధికారులు డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీలర్లు తమ తూనిక యంత్రాలను తీసుకువెళ్లారు.
ఆమదాలవలస : రేషన్ డిపోల్లో తూనిక యంత్రాలకు సీళ్లు వేసే ప్రక్రియలో సివిల్ సప్లయ్ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని పలువురు డీలర్లు ఆరోపిస్తున్నారు. సీళ్లు వేసే ప్రక్రియలో భాగంగా ఆమదాలవలసలోని కుసుమంచివారివీధిలో గోదాము వద్దకు రావాలంటూ ఆదివారం సివిల్ సప్లయ్ అధికారులు డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీలర్లు తమ తూనిక యంత్రాలను తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సీళ్లు వేసేందుకు అయ్యే ఖర్చు రూ.600గా పేర్కొంటూ రెండు రసీదులు ఇస్తూ ఒక్కో డీలర్ వద్ద రూ.900 వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించారు. ఈ విషయం బయటకు పొక్కితే డీలర్లపై ఉక్కుపాదం తప్పదని బెదిరించినట్లు కూడా సమాచారం. ఈ విషయమై సివిల్ సప్లయ్ డీ.టీ. టి.కూర్మారావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తూనికలు యంత్రాలకు సీళ్లు వేసే ప్రక్రియకు, తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.